మరో 6 నెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ : Manchu Vishnu

ABN , First Publish Date - 2022-05-15T18:42:52+05:30 IST

‘మా’ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా AIG హాస్పిటల్ (AIG Hospital) లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) మాట్లాడుతూ.. ‘మా’ సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్‌తో ‘మా’కు సేవలందించారు.

మరో 6 నెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ : Manchu Vishnu

‘మా’ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా AIG హాస్పిటల్ (AIG Hospital) లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) మాట్లాడుతూ.. ‘మా’ సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్‌తో ‘మా’కు సేవలందించారు. డా. నాగేశ్వర రెడ్డి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వారు. ‘మా’ సభ్యులందరూ బెనిఫిట్స్ పొందుతున్నారు..‌. అన్నారు విష్ణు. ఈ సమావేశంలో నరేష్ (Naresh) మాట్లాడుతూ..   మంచు విష్ణు అధ్యకుడైన తరువాత ఫస్ట్ ప్రిపారెన్స్‌గా హెల్త్ కి ఇవ్వడం సంతోషంగా వుంది. సభ్యుల అవకాశాలకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆరోగ్యం వుంటే అవకాశాలు వస్తాయి. AIG హాస్పిటల్ వారు ‘మా’ కు చేస్తున్న సహకారం మరువలేనిది. AIG హాస్పిటల్ కి ఇంటర్ నేషనల్ లెవెల్ లో చికిత్స కోసం వస్తున్నారు. AIG హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డి (nageswar reddy) కి కృతజ్ఞతలు. మంచు విష్ణు అధ్వర్యంలో రెండో హెల్త్ క్యాంప్ జరుగుతుంది.. ఇప్పుడు వున్న ‘మా’ టీమ్ ఫర్ఫెక్ట్’ అని అన్నారు. 


డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..  విష్ణు, నరేష్‌లు నాకు మంచి ఫ్రెండ్స్. మూవీ ఆర్టిస్ట్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూ వుంటారు.కరోనా టైంలో కూడా రిస్క్ చేసి సినిమాలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ (Movie Artistes) లకు ప్రివెంట్ హెల్త్ చెకప్ చాలా అవసరం.వరల్డ్స్ బెస్ట్ 50హాస్పిటల్స్ లో ప్రివెంట్ హెల్త్ (Prevent Health) కోసం ఏమి చేస్తారో ఆ ఎక్విప్‌మెంట్ ఈ హాస్పిటల్ లో వుంది. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నేషనల్ ఇంటర్ నేషనల్ లెవెల్ లో మంచి పేరు వచ్చింది.. అన్నారు. ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి (Madala ravi ) మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ పరంగా ఎంతో సహకారం అందిస్తున్న Aig హాస్పిటల్ వారికి ధన్యవాదములు. మంచు విష్ణు (Manchu Vishnu)  హెల్త్‌కి వెల్ఫేర్ కి ఎంతో ప్రాముఖ్యత నిస్తున్నారు.


మరో ఆరునెలల లోపే మా బిల్డింగ్ (Maa Building) కి భూమి పూజ చేస్తాము. మా‌ సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం..‌సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు. కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు. .ప్రభుత్వ సహకారం ఉంది‌ కాబట్టి ...‌పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ  డిబేట్ చేసుకొవాలి.‌ ‘మా’ సభ్యత్వంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము అని విష్ణు అన్నారు. 

Updated Date - 2022-05-15T18:42:52+05:30 IST