మంచు విష్ణుని టార్గెట్ చేశాడని.. మంచు మనోజ్ చెప్పిన ఆ వ్యక్తి ఎవరు?

ABN , First Publish Date - 2022-03-22T03:05:02+05:30 IST

ఓ వ్యక్తి అన్నయ్యని టార్గెట్ చేస్తూ.. మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఎంతగానో ప్రయత్నించాడు. అందులో భాగంగా మాకు సపోర్ట్ చేస్తున్న.. తనకంటే పెద్దవాళ్లని కూడా కించపరిచేలా దూషించాడు. అప్పుడు నాన్నగారు..

మంచు విష్ణుని టార్గెట్ చేశాడని.. మంచు మనోజ్ చెప్పిన ఆ వ్యక్తి ఎవరు?

శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవ వేడుకలో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ‘మా’ ఎన్నికల సమయంలో ఓ వ్యక్తి మంచు విష్ణుని కావాలని టార్గెట్ చేశారని ఆరోపిస్తూ మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలతో.. ఇప్పుడంతా ఎవరా వ్యక్తి? అని ఆరా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇంతకీ మంచు మనోజ్ ఏమన్నారంటే.. ‘‘జీవిత లక్ష్యం కంటే ముందు.. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి విలువలు కలిగి ఉండాలి. ఈ విలువలు తెలియకపోతే.. వారి వల్ల పక్కన ఉన్నవాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలే. పోటీకి ఇద్దరు నిలబడినా.. పోటీ తర్వాత అందరూ ఒక్కటే. కానీ, ఓ వ్యక్తి అన్నయ్యని టార్గెట్ చేస్తూ.. మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఎంతగానో ప్రయత్నించాడు. అందులో భాగంగా మాకు సపోర్ట్ చేస్తున్న.. తనకంటే పెద్దవాళ్లని కూడా కించపరిచేలా దూషించాడు. అప్పుడు నాన్నగారు.. ‘ఆ వ్యక్తిని పట్టించుకోకండి. అతనికి జీవిత లక్ష్యం అంటూ ఏమీ లేదు. అందుకే అలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటాడు..’ అని తెలిపారు. ఆ వ్యక్తి చుట్టూ ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు.. అయినా కూడా ఆ వ్యక్తి ఎటువంటి జీవిత లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు..’’ అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఇండస్ట్రీని మరోసారి వేడెక్కిస్తున్నాయి. మరి మంచు మనోజ్ చెప్పిన ఆ వ్యక్తి ఎవరో? ఈ మాటలకి అతను ఎలా రియాక్ట్ అవుతారో? వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2022-03-22T03:05:02+05:30 IST