అయ్యయ్యో.. ఇది నిజం కాకూడదు.. Puneeth Rajkumar మృతిపై మంచు లక్ష్మి ట్వీట్

ABN , First Publish Date - 2021-10-29T20:12:52+05:30 IST

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం చెందారు. ఇంట్లోనే వ్యాయామ శాలలో కసరత్తులు చేస్తుండగా సడన్‌గా ఆయన గుండెపోటుకు గురయ్యారు.

అయ్యయ్యో.. ఇది నిజం కాకూడదు.. Puneeth Rajkumar మృతిపై మంచు లక్ష్మి ట్వీట్



‘అయ్యో దేవుడా.. ఇది నిజం కాకూడదు. అసలు ఇదెలా జరిగింది..? పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయనకు ఇలా జరిగి ఉండకూడదు’ అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. 




కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం చెందారు. ఇంట్లోనే వ్యాయామ శాలలో కసరత్తులు చేస్తుండగా సడన్‌గా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చేర్చి ఐసీయూలో ఉంచి చికిత్సను అందించినా ఫలితం లేకుండా పోయింది. అభిమాన హీరో మరణాన్ని తట్టుకోలేక అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్ కుమార్‌ను కడసారి చూసుకునేందుకు అభిమానులంతా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబంతో మంచు మోహన్ బాబు కుటుంబానికి కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-10-29T20:12:52+05:30 IST