Bigg Boss 5 Telugu: అనుకున్నదే అయిందిగా.. మానస్ కూడా ఎలిమినేట్.. చివరగా ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2021-12-20T03:09:34+05:30 IST

అనుకున్నదే అయింది.. సిరి తర్వాత బిగ్‌బాస్‌ సీజన్-5 నుంచి మానస్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లోకి వెళ్లిన శ్యామ్ సింగరాయ్ టీమ్ టాప్‌-4లో ఉన్న నలుగురికి డబ్బులు ఆఫర్‌ చేశారు. ఎలిమినేట్ కోసం ఆఫర్ ఇస్తూ..

Bigg Boss 5 Telugu: అనుకున్నదే అయిందిగా.. మానస్ కూడా ఎలిమినేట్.. చివరగా ఏమన్నాడంటే..

అనుకున్నదే అయింది.. సిరి తర్వాత బిగ్‌బాస్‌ సీజన్-5 నుంచి మానస్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లోకి వెళ్లిన శ్యామ్ సింగరాయ్ టీమ్ టాప్‌-4లో ఉన్న నలుగురికి డబ్బులు ఆఫర్‌ చేశారు. ఎలిమినేట్ కోసం ఆఫర్ ఇస్తూ.. సూట్‌కేస్‌లో ఉన్న డబ్బు కావాలనుకుంటే తీసుకుని వెళ్లిపోవచ్చు.. అని నాని ఆఫర్‌ ఇవ్వగా అంతా తిరస్కరించారు. రెండోసారి కూడా ఆఫర్‌ ఇస్తానని నాగార్జున ప్రకటించినా ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం మేనిక‍్విన్ (బొమ్మల) గేమ్‌తో మానస్‌ ఎలిమినేట్‌ అయ్యాడని నాగార్జున ప్రకటించాడు. దీంతో శ్యామ్‌ సింగరాయ్‌ టీం మానస్‌తో పాటు హౌజ్‌ నుంచి బయటకు వచ్చారు.


బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక మానస్‌ మాట్లాడుతూ.. ‘జర్నీ అద్భుతంగా ఉంది. హౌస్‌మేట్స్‌ హృదయాలను గెలుచుకున్నా. ఓపిక ఎక్కువ ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నా. టైటిల్‌ గెలుచుకోవాలన్న ఫైర్‌ సన్నీలో ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు జర్నీ చేశాడు కాబట్టి కచ్చితంగా ప్రేక్షకుల మద్దతు ఉంటుంది. ఎవరి స్టైల్‌లో వాళ్లు ప్రయత్నించారు. టైటిల్‌ ఎవరు గెలిచిన మేమంతా ఏదో ఒకటి సాధించాం. ఇంత దూరం వచ్చామంటే మాలో ఏదో ఒక పాయింట్‌ ప్రేక్షకులకు నచ్చే ఉంటుంది. ఎవరు ఎక్కువ మందికి నచ్చితే వారే విన్నర్‌’’ అని పేర్కొన్నాడు. తదుపరి ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2021-12-20T03:09:34+05:30 IST