ఆరు ఆస్కార్స్ పొందిన హాలీవుడ్ సినిమా వెనుక ఓ భారతీయుడు.. ఇది ఏడోసారి..

ABN , First Publish Date - 2022-03-30T16:40:31+05:30 IST

ప్రముఖ కెనడియన్ ఫిల్మ్‌మేకర్‌ డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘డ్యూన్’. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇటీవలే జరిగిన 94వ అకాడమీ అవార్డ్స్‌లో..

ఆరు ఆస్కార్స్ పొందిన హాలీవుడ్ సినిమా వెనుక ఓ భారతీయుడు.. ఇది ఏడోసారి..

ప్రముఖ కెనడియన్ ఫిల్మ్‌మేకర్‌ డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘డ్యూన్’. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇటీవలే జరిగిన 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఆరు విభాగాల్లో అవార్డులను పొందింది. అందులో.. ‘నో టైమ్ టు డై’, ‘స్పైడర్ మ్యాన్‌: నో వే హోమ్’, ‘షాంగ్-చి’, ‘ఫ్రీ గాయ్’ వెనక్కినెట్టి మరి విజువల్ ఎఫెక్ట్స్‌లో సైతం అవార్డు సాధించింది. ఇక్కడో విషయం ఉంది. అదే ఇందులో ఓ భారతీయుడు భాగం కావడం. ఆయనే నమిత్ మల్హోత్రా.


నమిత్ నిర్వహిస్తున్న ‘డిఎన్ఈజీ’ స్టూడియో ‘డ్యూన్’కి విజువల్ ఎఫెక్ట్స్ చేసింది. ఈ మూవీతో పాటు ఇదే కేటగిరిలో నామినేట్ అయిన స్పై థ్రిల్లర్ ‘నో టైమ్ టూ డై’ సైతం ఈ కంపెనీయే వీఎఫ్‌ఎక్స్ అందించింది. అయితే చివరికి డ్యూన్ అవార్డు పొందింది. అయితే ఈ కంపెనీకి ఇదే మొదటి అవార్డు కాదు. గతంలో సైతం ‘టెనెట్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘ఇన్‌సెప్షన్’, ‘ఎక్స్ మచిన’, ‘బ్లేడ్ రన్నర్ 2049’, ‘ఫస్ట్ మ్యాన్’ సినిమాకి సైతం ఈ విభాగంలో ఆస్కార్స్‌ని సొంతం చేసుకుంది.


అయితే.. ‘హే డిల్లాగి’, ‘అచానక్’, ‘క్రాంతి’, ‘దిల్ కా రిస్టా’ వంటి బాలీవుడ్ దర్శకత్వం వహించిన నరేశ్ మల్హోత్రా కొడుకు, సినిమాటోగ్రాఫర్ ఎమ్.ఎన్.మల్హోత్రా మనవడైన నమిత్ ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్‌ని స్థాపించాడు. అనంతరం డబుల్ నెగటివ్‌తో కలిసి ‘డిఎన్ఈజీ’గా మారింది. తన కంపెనీ సాధించిన ఏడో ఆస్కార్ గురించి నమిత్ మాట్లాడుతూ.. ‘డ్యూన్ సినిమా మాకు చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం డ్యూన్‌ని ముందు, తర్వాత అంటూ విజువల్ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి మా టీం పెట్టిన ఎఫర్ట్స్‌కి చాలా గర్వపడుతున్నాను. భవిష్యత్తులోనూ ఇలాగే పనిచేయాలని కోరుకుంటున్నా. ఇకపై వెనక్కి తిరిగి చూసుకునేది లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-03-30T16:40:31+05:30 IST