Mammotty : ఓటీటీలో విడుదల కానున్న తాజా చిత్రం

ABN , First Publish Date - 2022-05-09T15:27:51+05:30 IST

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ము్ట్టి (Mammootty) ఈ ఏడాది ‘భీష్మ పర్వం’ (Bheeshma parvam), ‘సిబిఐ 5 : ది బ్రెయిన్’ (CBI 5 : The Brain) చిత్రాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలు మమ్ముట్టి కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేశాయి. ఇక తాజాగా ఆయన నటించిన మరో చిత్రం ‘పుళు’ ([Puzhu) (పురుగు). ఇదొక డిఫరెండ్ కాన్సెప్ట్ మూవీ.

Mammotty : ఓటీటీలో విడుదల కానున్న తాజా చిత్రం

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఈ ఏడాది ‘భీష్మ పర్వం’ (Bheeshma parvam), ‘సిబిఐ 5 : ది బ్రెయిన్’ (CBI 5 : The Brain) చిత్రాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలు మమ్ముట్టి కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేశాయి. ఇక తాజాగా ఆయన నటించిన మరో చిత్రం ‘పుళు’ ([Puzhu) (పురుగు). ఇదొక డిఫరెండ్ కాన్సెప్ట్ మూవీ. ఇందులో మమ్ముట్టి పోలీసాఫీసర్‌గా నటించారు. రతీనా పీటీ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్ఖర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ , సిన్‌సిల్ సెల్యూలాయిడ్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇదొక మిస్టిక్ థ్రిల్లరని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. నిజానికి థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను ఎట్టకేలకు ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. ఈ నెల 13న ఈ సినిమా సోనీ లివ్ లో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. 


‘పుళు’ (Puzhu) చిత్రం ముఖ్యంగా తండ్రీ, కొడుకుల రిలేషన్‌ను తెలియచేస్తుంది. కొన్ని కారణాలవల్ల తన భార్యనుంచి విడిపోయిన కథానాయకుడు తన కొడుకును ఎంత క్రమశిక్షణతో పెంచాడు? ఆ కొడుకుకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది? చివరికి తన కొడుకు కోసం ఆ తండ్రి ఏం చేశాడు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మమ్ముట్టి  (Mammootty) కెరీర్‌లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. వాసుదేవ్ సజీత్ మరార్ అనే కుర్రాడు మమ్ముట్టి కొడుకుగా నటిస్తున్నాడు. పార్వతి తిరువోత్తు కథానాయికగా నటిస్తోంది. ఇంకా నెడుముడి వేణు, ఆత్మీయ రాజన్, కుంచన్, మాళవికా మీనన్ , ఇంద్రన్స్, శ్రీదేవి ఉన్ని, కొట్టయం రమేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా మమ్ముట్టికి ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి. 



Updated Date - 2022-05-09T15:27:51+05:30 IST