Sarath chandran: మలయాళ నటుడు మృతి!

ABN , First Publish Date - 2022-07-30T23:14:33+05:30 IST

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు శరత్‌ చంద్రన్‌(37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని కాక్కడ్‌ ప్రాంతంలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించారు శరత్‌. తన మరణానికి ఎవరు కారణం కాదనే సూసైడ్‌ నోట్‌ లభ్యం కావడంతో పోలీసులు దీనిని ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు

Sarath chandran: మలయాళ నటుడు మృతి!

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు శరత్‌ చంద్రన్‌(37)(Sarath chandra) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని కాక్కడ్‌ ప్రాంతంలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించారు శరత్‌. తన మరణానికి ఎవరు కారణం కాదనే సూసైడ్‌ నోట్‌ లభ్యం కావడంతో పోలీసులు దీనిని ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు. శరత్‌ మరణ వార్త తెలుసుకున్న మలయాళ చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంటోనీ వర్గీస్‌ పెపే సోషల్‌ మీడియా వేదికగా శరత్‌ మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘ఒరు మెక్సికన్‌’, ‘సీఐఏ కామ్రేడ్‌ ఇన్‌ అమెరికా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు శరత్‌. తొలుత ఐటీ సంస్థలో పనిచేసిన శరత్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌  మొదలుపెట్టారు. లిజో జోస్‌ పెల్లిస్సేరి తెరకెక్కించిన యాక్షన్‌ డ్రామా ‘అంగమలీ డైరీస్‌’(Angamaly Diaries)లో శరత్‌  కీలక పాత్ర పోషించి అలరించారు. (sarath chandran passed away)


Updated Date - 2022-07-30T23:14:33+05:30 IST