కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా సినీ ఇండస్ట్రీనే కెరీర్‌గా ఎంచుకున్న సెలబ్రిటీలు

ABN , First Publish Date - 2022-04-28T23:59:52+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్ తదితరులు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.

కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా సినీ ఇండస్ట్రీనే కెరీర్‌గా ఎంచుకున్న సెలబ్రిటీలు

బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్ తదితరులు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. పరిశ్రమలో వారికీ విజయం అంత సులభంగా దక్కలేదు. ఈ ప్రయాణంలో అనేక ఎత్తు, పల్లాలను ఎదుర్కొన్నారు. నిజం చెప్పాలంటే.. తమ కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా సినిమాలను కెరీర్‌గా ఎంచుకున్నారు. అలా తమ ఫ్యామిలీని ఎదిరించి సినీ ఇండస్ట్రీని కెరీర్‌గా ఎంచుకున్న సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దామా..


కంగనా రనౌత్: 

బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య కథలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. సమకాలీన అంశాలపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంటుంది. కంగన తండ్రికి ఆమె డాక్టర్ కావాలని ఉండేదట. కానీ, చిన్న వయసులోనే కంగన ఇంటిని వదిలివేసి వచ్చి నటనను కెరీర్‌గా ఎంచుకుంది. దీంతో కుటుంబం ఆమెను చాలా కాలం పాటు దూరం పెట్టింది. 


ఇర్ఫాన్ ఖాన్: 

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. అతడు ఓ చిన్న గ్రామం నుంచి వచ్చి బీ టౌన్ లో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇర్ఫాన్ భూస్వామ్య కుటుంబానికి చెందినవాడు. తాను నటుడిగా మారతానని తన కుటుంబం కలలో కూడా అనుకోలేదని ఇర్ఫాన్ పలుమార్లు చెప్పాడు. అతడు కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా మరణించాడు.


ఆమిర్ ఖాన్: 

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్. అభిమానులందరు ముద్దుగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అని పిలుస్తుంటారు. అతడు ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఆమిర్ కుటుంబ సభ్యులు అతడిని ఇంజినీర్‌గా చూడాలనుకున్నారట. తమ ఫ్యామిలీకీ సినిమాలతో సంబంధం ఉన్నప్పటికీ దానిని కెరీర్‌గా ఎంచుకోవడం ఇష్టం లేదట. సినిమాలు చేస్తానంటే వారు ససేమిరా ఒప్పుకోలేదట.   


కరి‌ష్మా కపూర్: 

బాలీవుడ్‌లో ప్రస్తుతం కపూర్ కుటుంబం నుంచి అనేక మంది నటీ, నటులు ఉన్నారు. కానీ, గతంలో ఓ మహిళ హీరోయిన్‌గా నటిస్తానంటే ఎవరు  ఒప్పుకోలేదట. కరిష్మా కపూర్ సినీ ఇండస్ట్రీని కెరీర్‌గా ఎంచుకుంటనంటే ఆమె తండ్రి రణధీర్ కపూర్ ససేమిరా అన్నాడట. అయినప్పటికీ, కరిష్మా 15ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది. అప్పట్లోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది. 


మల్లికా శెరావత్: 

సినిమాల్లోకి రావడానికి పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చిందని అనేక సార్లు మల్లికా శెరావత్ చెప్పింది. మల్లిక సినిమాల్లోకి రావడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో ఆమె ఇంటి నుంచి పారిపోయి వచ్చి, బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా మారితే కుటుంబం పరువు పోతుందని ఆమె తండ్రి అంగీకరించలేదు. 


Updated Date - 2022-04-28T23:59:52+05:30 IST