విల్‌ స్మిత్ చెంపదెబ్బ.. డెంజెల్ వాషింగ్టన్ సలహా.. ‘లూసిఫర్-2’ హింట్..

ABN , First Publish Date - 2022-03-29T02:47:22+05:30 IST

సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 94వ ఆస్కార్ అవార్డ్స్‌ను

విల్‌ స్మిత్ చెంపదెబ్బ.. డెంజెల్ వాషింగ్టన్ సలహా.. ‘లూసిఫర్-2’ హింట్..

సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 94వ ఆస్కార్ అవార్డ్స్‌ను లాస్ ఏంజెలిస్‌లో మార్చి 27న ప్రదానం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ అకాడమీ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా హోస్ట్ క్రిస్ ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌పై జోక్ వేశాడు. దీనికి విల్ స్మిత్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చి క్రిస్ చెంప పగలగొట్టాడు. ఈ సమయంలో విల్ స్మిత్‌ను సముదాయించేందుకు డెంజెల్ వాషింగ్టన్ ప్రయత్నించాడు. అతడికీ ఓ సలహాను ఇచ్చాడు. అనంతరం క్రిస్ రాక్ ఈ అవార్డులను వేడుకలను తనదైన శైలిలో కొనసాగించాడు. ‘‘ఈ రాత్రి  టెలివిజన్ చరిత్రలోనే అద్భుతమైనది’’ అని అతడు తెలిపాడు. 


‘కింగ్ రిచర్డ్’ సినిమాలోని పాత్రకు గాను విల్‌స్మిత్ ఉత్తమ నటుడి అవార్డును గెలుపొందాడు. అనంతరం ఎమోషనల్‌గా తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఉదయం నుంచి జరుగుతన్న ఘటనలను మలయాళం స్టార్ హీరో..పృథ్వీరాజ్ సుకుమారన్ గమనిస్తూ వచ్చాడు. ఈ సందర్భంగా లూసిఫర్ రెండో భాగంపై హింటిచ్చాడు. విల్ స్మిత్‌కు డెంజెల్ వాషింగ్టన్ సలహాను ఇచ్చినట్టుగా ఓ పోస్ట్ చేశాడు. పృథ్వీరాజ్ తొలిసారి దర్శకుడిగా మారి ‘లూసిఫర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2019లో విడుదల కాగా నేటికీ మూడేళ్లు అవుతోంది. దీంతో లుసిఫర్ రెండో భాగంపై ఓ పోస్ట్ పెట్టాడు. మోహన్ లాల్ ఇంటెన్స్ పిక్చర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘జీవితంలోని నీ అత్యున్నత క్షణంలో.. జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ‘ప్రమాదం’ అప్పుడే నిన్ను వెదుక్కుంటూ వస్తుంది.. ’’ అని డెంజెల్ వాషింగ్టన్ సలహాను ఇచ్చినట్టుగా పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్ చేశాడు.



Updated Date - 2022-03-29T02:47:22+05:30 IST