వేధింపులకి గురయిన మాలీవుడ్ హీరోయిన్ Parvathy Thiruvothu

ABN , First Publish Date - 2021-12-21T02:41:13+05:30 IST

చార్లీ, బెంగళూరు డేస్, టే కాఫ్ వంటి విభిన్న రకాల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి పార్వతి తిరువొత్తు

వేధింపులకి గురయిన మాలీవుడ్ హీరోయిన్ Parvathy Thiruvothu

చార్లీ, బెంగళూరు డేస్, టే కాఫ్ వంటి విభిన్న రకాల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి పార్వతి తిరువొత్తు. ఆమెకు ఒక వ్యక్తి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. గత 2 ఏళ్ల నుంచి అతడు  వెంటపడి, వేధిస్తున్నాడని హీరోయిన్ ఆరోపించింది. ఫలితంగా ఆ వ్యక్తిని డిసెంబర్ 20న పోలీసులు అరెస్టు చేశారు. 


పోలీసుల కథనం ప్రకారం. . హర్ష అనే వ్యక్తి కొల్లాంలో నివాసముంటున్నాడు. అతడికి దాదాపుగా 34 ఏళ్ల నుంచి 35ఏళ్ల వరకు వయసు ఉంటుంది. అతడు ఫుడ్‌ పార్శిల్‌ పట్టుకుని హీరోయిన్ ఇంటికి తరచుగా వస్తుండేవాడు. మొదటి సారి వచ్చినప్పుడే  ఆహారాన్ని తీసుకురావొద్దని పార్వతి కుటుంబం చెప్పింది. అయినప్పటికి అతడు వినలేదు. ఆమెకు ఇబ్బంది కలిగిస్తూనే ఇంటికి వస్తుండేవాడు. సెక్యూరిటీతో గొడవ పెట్టుకునేవాడు. గత కొన్ని ఏళ్లుగా ఆమె సెల్‌ఫోన్‌కు అసభ్యకర రీతిలో సందేశాలు పంపిస్తున్నాడు. దీంతో ఆ వ్యక్తిపై పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 354 డీ ( స్టాకింగ్) సెక్షన్ కింద అతడి‌పై కేసును నమోదు చేశారు. గత 2ఏళ్ల క్రితం కూడా ఆమెకు ఇలాంటి  వేధింపులే ఎదురయ్యాయి. కిషోర్ అనే వ్యక్తి  తనను  తాను లాయర్, ఫిల్మ్ మేకర్‌గా పార్వతి కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్‌ని వేధింపులకు గురి చేశాడు. 

Updated Date - 2021-12-21T02:41:13+05:30 IST