సేమ్ డ్రస్సులను రిపీట్ చేస్తుండటంపై నెటిజన్ల నుంచి ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి

ABN , First Publish Date - 2022-01-07T19:29:22+05:30 IST

నెట్ వినియోగం ఎక్కువైపోవడంతో దాదాపు అందరూ సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు...

సేమ్ డ్రస్సులను రిపీట్ చేస్తుండటంపై నెటిజన్ల నుంచి ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి

నెట్ వినియోగం ఎక్కువైపోవడంతో దాదాపు అందరూ సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. దీంతో అనవసరమైన విషయాలపై సెటబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైపోయింది. ఇటీవలే మలయాళ నటి కనీహని దుస్తులు రిపీట్‌గా వేసుకుంటోందని నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో ఈ ట్రోలర్స్‌కు కనీహని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఆ పోస్ట్‌లో.. ‘అవును.. నేను నా దుస్తులను రిపీటెడ్‌గా వేసుకుంటాను. నేను నా దుస్తులను రీసైకిల్ చేసి, అప్‌సైకిల్ చేస్తాను. అవును, నా దగ్గర బ్రాండ్‌లు, డిజైనర్ దుస్తులతో కూడిన ఫ్యాన్సీ వార్డ్‌రోబ్ లేదు’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెస్టింది. 


అంతేకాకుండా.. ‘మీడియాలో, ఎంటర్‌టైన్ మెంట్ రంగాల్లో పని చేసే వ్యక్తులు ఇలాగే దుస్తులు వేసుకోవాలని ఏమైనా ఉందా?  మీకు సౌకర్యంగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే వాటిని ధరించండి. మీ వైఖరి అన్నింటికి సమాధానంగా ఉండాలి. మీలో కొందరు నన్ను అడిగే అనేక ప్రశ్నలకు ఈ పోస్ట్‌తో ఆన్సర్ దొరికొందని ఆశిస్తున్నాన‌ు’ అంటూ ట్రోలర్స్‌కు కనీహని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.



Updated Date - 2022-01-07T19:29:22+05:30 IST