లైంగిక వేధింపుల కేసులో Kerala Actor Vijay Babuకి ముందస్తు బెయిల్

ABN , First Publish Date - 2022-06-22T19:41:55+05:30 IST

మలయాళ సినీ నిర్మాత, నటుడు విజయ్ బాబుపై అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది...

లైంగిక వేధింపుల కేసులో Kerala Actor Vijay Babuకి ముందస్తు బెయిల్

మలయాళ సినీ నిర్మాత, నటుడు విజయ్ బాబుపై అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే విచారణ నిమిత్తం.. జూన్ 27 నుంచి జులై 3 వరకు పోలీసుల ఎదుట హాజరుకావాలని, బాధితురాలిని లేదా ఆమె కుటుంబాన్ని బెదిరించకూడదని, కేరళ విడిచి వెళ్లకూడదని న్యాయమూర్తి షరతులు విధించారు. అలాగే.. పాస్‌పోర్ట్‌ని సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ ఆదేశించారు.


ఒకవేళ విజయ్‌ని పోలీసులు అరెస్టు చేస్తే, రూ.5 లక్షల బాండ్‌‌పై ఇద్దరూ సాక్ష్యుల సంతకం తీసుకొని బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. మధ్యంతర బెయిల్ మీద ఉన్న కాలాన్ని సైతం నటుడు పోలీసు కస్టడీలో ఉన్నట్లుగా పరిగణించాలని కోర్టు తెలిపింది. కాగా.. మలయాళీ నటుడు విజయ్ బాబు (Vijay Babu) తనని లైంగికంగా వేధించాడని చెబుతూ ఓ నటి పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై వివరణ ఇస్తూ ఫేస్‌బుక్ లైవ్‌లో ఆ నటి పేరును వెల్లడించాడు. దీంతో నియమాలకు విరుద్ధంగా లైంగిక వేధింపురాలి పేరును బయటపెట్టినందుకు ఆయనపై కేసు నమోదైంది. విజయ్‌పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. దీంతో తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకే తనపై అత్యాచారం కేసు పెట్టారని చెబుతూ విజయ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ వేశారు. విజయ్‌కి మే 31న ముందస్తు బెయిల్ మంజూరైంది. అనంతరం ఎప్పటికప్పుడూ ఆ బెయిల్‌ని పొడిగిస్తూ వస్తోంది.

Updated Date - 2022-06-22T19:41:55+05:30 IST