లైంగిక దాడి కేసులో మలయాళీ నటుడు Vijay Babu అరెస్టు

ABN , First Publish Date - 2022-06-27T23:24:59+05:30 IST

మలయాళీ నటుడు, నిర్మాత విజయ్ బాబు (Vijay Babu) తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ యువనటి ఆరో‌పించిన సంగతి తెలిసిందే. అతడికి వ్యతిరేకంగా కొచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా

లైంగిక దాడి కేసులో మలయాళీ నటుడు Vijay Babu అరెస్టు

మలయాళీ నటుడు, నిర్మాత విజయ్ బాబు (Vijay Babu)తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ యువనటి ఆరో‌పించిన సంగతి తెలిసిందే. అతడికి వ్యతిరేకంగా కొచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని విజయ్ నమ్మించాడని ఆమె చెప్పింది. కొచ్చిలోని తన ఫ్లాట్‌కు పిలిచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసును నమోదు చేశారు. అందులో భాగంగా ఎర్నాకులం పోలీసులు జూన్ 27న అతడిని అరెస్టు చేశారు. 


విజయ్ బాబు అంతకు ముందు బెయిల్ నిమిత్తం కేరళ హైకోర్టు మెట్లెక్కాడు. న్యాయస్థానం కొన్ని షరతులు విధిస్తూ జూన్ 22న అతడికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. రాష్ట్రం విడిచి వెళ్లకూడదని కోరింది. పాస్‌పోర్టును సరెండర్ చేయాలని ఆదేశాలిచ్చింది. జాన్ 27నుంచి జులై 3 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో విజయ్ బాబుకు మలయాళం చిత్ర పరిశ్రమ తమ పూర్తి మద్దతును ప్రకటించింది. ద అసోసియేషన్ ఫర్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (the Association for Malayalam Movie Artists)(AMMA) సమావేశం తాజాగా జరిగింది. విజయ్‌కు తమ మద్దతును తెలిపింది. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అతడిపై చర్యలు తీసుకోబోమని చెప్పింది. అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై అనుబంధ విభాగం విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC)అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో అనుబంధ విభాగమైన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (Internal Complaints Committee) నుంచి మలయాళీ నటి శ్వేతా మీనన్ రాజీనామా చేసింది. ఏప్రిల్ చివరివారలో విజయ్ బాబు మీద కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత అరెస్ట్ చేస్తారనే భయంతో అతడు దేశం విడిచి దుబాయ్ పారిపోయాడు.

Updated Date - 2022-06-27T23:24:59+05:30 IST