Malavika mohanan: ప్రభాస్‌ అంటే పిచ్చి.. విజయ్‌తో రొమాంటిక్‌ సినిమా

ABN , First Publish Date - 2022-05-21T21:45:21+05:30 IST

ప్రభాస్‌ అంటే ఇష్టం... యశ్‌కు వీరాభిమానిని.. విజయ్‌ దేవరకొండతో రొమాంటిక్‌ సినిమా చేయాలనుంది.. మాలయాళ బ్యూటీ మాళవికా మోహనన్‌ చెబుతున్న మాటలివి! కేరళలో పుట్టి, ముంబైలో పెరిగిన ఈ బ్యూటీ మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించారు. రజనీకాంత్‌ ‘పేట’, ధనుష్‌ ‘మారన్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు తెలుగు చిత్రాలపై కన్నేసింది.

Malavika mohanan: ప్రభాస్‌ అంటే పిచ్చి.. విజయ్‌తో రొమాంటిక్‌ సినిమా

ప్రభాస్‌(Prabhas) అంటే ఇష్టం...

యశ్‌(Yash)కు వీరాభిమానిని..

విజయ్‌ దేవరకొండ(Vijay devarakonda)తో రొమాంటిక్‌ సినిమా చేయాలనుంది..

మాలయాళ బ్యూటీ మాళవికా మోహనన్‌ చెబుతున్న మాటలివి!

కేరళలో పుట్టి, ముంబైలో పెరిగిన ఈ బ్యూటీ మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించారు. రజనీకాంత్‌ ‘పేట’, ధనుష్‌ ‘మారన్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు తెలుగు చిత్రాలపై  కన్నేసింది. టాలీవుడ్‌  హీరోలంటే ఇష్టమని చెబుతూ, పొగడ్తల వర్షం కురిపిస్తోంది. తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఆమె అభిమానులతో మాట్లాడారు. నెటిజన్లు అడిగిన  ప్రశ్నలకు సమాధానం చెప్పారు.                     

                                                                                                

"టాలీవుడ్‌ డార్లింగ్‌ ప్రభాస్‌(prabhas) అంటే నాకు పిచ్చ ఇష్టం. ‘బాహుబలి’ రెండు చిత్రాలను 15సార్లకు పైగా చూశా. అవకాశం వస్తే ప్రభాస్‌ సినిమాలో తప్పకుండా నటిస్తా’’ అని చెప్పారు. కన్నడ సినిమాల్లో నటిస్తారా అని మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ‘యశ్‌కు నేను వీరాభిమానిని. ‘కేజీయఫ్‌’ విడుదలకు ముందే ఆయనంటే ఇష్టం. ఏదో ఒకరోజు ఆయన ఉన్నత స్థాయికి చేరుకుంటారని అప్పుడే అనుకున్నా. ఆయన లైఫ్‌స్టోరీ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఆయనతో కూడా కలిసి నటించాలనుంది’’ అని అన్నారు. ఇక టాలీవుడ్‌కి వస్తే విజయ్‌ దేవరకొండతో రొమాంటిక్‌–కామెడీ చిత్రంలో నటించాలనుందని తన మనసులో మాట చెప్పారు మాళవిక మోహనన్‌. 

Updated Date - 2022-05-21T21:45:21+05:30 IST