Malavika Mohanan : అభిమాని ప్రశ్నకు దీటైన జవాబు

ABN , First Publish Date - 2022-05-22T19:27:34+05:30 IST

‘పేట’ (Petta), ‘మాస్టర్‌’ (Master), ‘మారన్‌’ (Maran) లాంటి చిత్రాల్లో నటించిన మాళవికా మోహనన్‌ (Malavika Mohanan) కు.. ఆ సినిమాలతో రావల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇంతకు ముందు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించినప్పటికీ.. అక్కడా సరైన స్థాయిలో పేరు రాలేదు. ప్రస్తుతం ఈ సుందరి ‘యుద్ర’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.

Malavika Mohanan : అభిమాని ప్రశ్నకు దీటైన జవాబు

‘పేట’ (Petta), ‘మాస్టర్‌’ (Master), ‘మారన్‌’ (Maran) లాంటి చిత్రాల్లో నటించిన మాళవికా మోహనన్‌ (Malavika Mohanan) కు.. ఆ సినిమాలతో రావల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.  ఇంతకు ముందు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించినప్పటికీ.. అక్కడా సరైన స్థాయిలో పేరు రాలేదు.  ప్రస్తుతం ఈ సుందరి ‘యుద్ర’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని ఆశిస్తోంది. ఇక అమ్మడికి సినిమాలతో పాటు సోషల్ మీడియా మరో వ్యాపకంగా మారింది.   సోషల్‌ మీడియాలో ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈమెకు ‘మారన్‌’ చిత్రం తర్వాత తమిళంలో ఒక్క అవకాశం కూడా లేదు. తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉంది. 


ఈ నేపథ్యంలో తాజాగా మాళవికా మోహనన్(Malavika Mohanan) సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఆ సమయంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మాళవిక ఖంగుతింది. ‘మారన్‌’ (Maran) చిత్రంలో హీరో ధనుష్‌(Dhanush) తో కలిసి నటించిన పడక సీన్‌ ఎన్నిసార్లు షూట్‌ చేశారంటూ ప్రశ్నించడంతో.. తొలుత షాక్‌కు గురైన మాళవిక  ఆ తర్వాత తేరుకుని ‘ఇలాంటి ప్రశ్న వేసిన మీ బుర్రలో ఎలాంటి చెడు ఆలోచనలు ఉన్నాయో ఇట్టే తెలిసిపోతున్నాయి’ అంటూ గట్టిగా బదులిచ్చింది. దాంతో ఆ అభిమాని తోకముడిచాడు. ఆమె సమాధానానికి పలువురు నెటిజెన్స్ ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ పెట్టారు. ప్రస్తుతం మాళవిక సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-05-22T19:27:34+05:30 IST