హీరోయిన్‌గా మాలాశ్రీ కుమార్తె

ABN , First Publish Date - 2022-08-08T06:02:25+05:30 IST

ఒకప్పుడు కథానాయికగా తనదైన ముద్ర వేసి, తన గ్లామర్‌ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు మాలాశ్రీ. ఇప్పుడు ఆమె కుమార్తె రధనా రామ్‌ కథానాయికగా పరిచయం కానున్నారు...

హీరోయిన్‌గా మాలాశ్రీ కుమార్తె

ఒకప్పుడు కథానాయికగా తనదైన ముద్ర వేసి, తన గ్లామర్‌ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు మాలాశ్రీ. ఇప్పుడు ఆమె కుమార్తె రధనా రామ్‌ కథానాయికగా పరిచయం కానున్నారు. దర్శన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘డి 56’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో రధనాని కథానాయికగా ఎంచుకొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తరుణ్‌ సుధీర దర్శకుడు. శుక్రవారం బెంగళూరులో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. మాలాశ్రీ మాట్లాడుతూ ‘‘నా సినిమాతోనే రాక్‌ లైన్‌ వెంకటేశ్‌ నిర్మాతగా అడుగుపెట్టారు. ఇప్పుడు నా కుమార్తె తొలి చిత్రానికి ఆయన నిర్మాత కావడం ఆనందంగా ఉంది. రధనాకి నటన అంటే చాలా ఇష్టం. ముంబైలో డాన్స్‌ కూడా నేర్చుకొంద’’న్నారు. ఇదో యాక్షన్‌ కథా చిత్రమని, చక్కని సందేశం కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు. 


Updated Date - 2022-08-08T06:02:25+05:30 IST