Malaikaకు యాక్సిడెంట్... గాయాలు... ఇంతకీ, ఏమైందంటే...

ABN , First Publish Date - 2022-04-03T16:54:22+05:30 IST

పూణేలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న మలైకా అరోరా తిరిగి ముంబైకి వస్తుండగా యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ముంబై శివార్లలో ప్రమాదం జరిగిందట.

Malaikaకు యాక్సిడెంట్... గాయాలు... ఇంతకీ, ఏమైందంటే...

బాలీవుడ్ యాక్టర్, టెలివిజన్ పర్సనాలిటీ మలైకా అరోరా యాక్సిడెంట్‌కి గురైంది. ముంబై-పూణే హైవేపై ఆమె ప్రయాణిస్తోన్న కారు ప్రమాదం బారినపడింది. అయితే, మలైకాకి కేవలం స్వల్ప గాయాలే అయ్యాయి. ఆమెని యాక్సిడెంట్‌ జరిగిన వెంటనే నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. శనివారం హాస్పిటల్‌లో అడ్మిట్ చేయగా ఆదివారం ఉదయం మలైకాని డిశ్చార్జ్ చేసేస్తామని అపోలో వైద్యులు ప్రకటించారు. సీటీ స్కాన్‌లో అంతా నార్మల్‌గానే ఉన్నట్టు రిపోర్ట్ రావటంతో డాక్టర్స్ ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. మలైకా నుదురు, కంటి మీద చిన్న పాటి గాయాలయ్యాయని వారు వివరించారు. 


పూణేలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న మలైకా అరోరా తిరిగి ముంబైకి వస్తుండగా యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ముంబై శివార్లలో ప్రమాదం జరిగిందట. ఓ బస్సు, మూడు కార్లు అదుపు తప్పి ఢీకొట్టుకోవటంతో మలైకా గాయాలపాలు కావాల్సి వచ్చింది. ఆమె ప్రయాణీస్తోన్న రేంజ్ రోవర్ కారు కూడా డ్యామేజ్ అయింది.  


తెలుగులో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, మహేశ్ బాబు ‘అతిథి’ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన మలైకా కొన్నాళ్ల క్రితం భర్త అర్భాజ్ ఖాన్ నుంచీ విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె అర్జున్ కపూర్‌తో సహ జీవనం చేస్తోంది. పలు టెలివిజన్ షోస్‌లో జడ్జ్‌గా వ్యవహరిస్తోంది కూడా...  

Updated Date - 2022-04-03T16:54:22+05:30 IST