నేను కావాలని 'sexy'గా ఉండనంటోన్న ‘spicy’ బ్యూటీ!

ABN , First Publish Date - 2022-03-11T01:07:10+05:30 IST

48 ఏళ్ల వయస్సులో కూడా తనని అందరూ ‘సెక్సీ’ అనటంపై బాలీవుడ్ బ్యూటీ మలైకా స్పందించింది. ‘‘మై గాడ్, నేను నిజంగా ‘ఆ ట్యాగ్’ను అంటిపెట్టుకున్నాను!’’ అందామె. అంతే కాకుండా...

నేను కావాలని 'sexy'గా ఉండనంటోన్న ‘spicy’ బ్యూటీ!

48 ఏళ్ల వయస్సులో కూడా తనని అందరూ ‘సెక్సీ’ అనటంపై బాలీవుడ్ బ్యూటీ మలైకా స్పందించింది. ‘‘మై గాడ్, నేను నిజంగా ‘ఆ ట్యాగ్’ను అంటిపెట్టుకున్నాను!’’ అందామె. అంతే కాకుండా ‘‘మీరు ఎవరినైనా ఓ బిరుదుతోనో లేదా కిరీటంతోనో సత్కరిస్తే... వారు ఎప్పటికీ దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు... నేను కూడా నాకిచ్చిన ‘ట్యాగ్‌’కి అంటిపెట్టుకుని ఉండిపోయానని అనుకుంటున్నాను’’ అంది మలైకా. 


‘సెక్సీ’ అనే ట్యాగ్‌ను ఎంతో ఇష్టంగా కాపాడుకుంటూ వస్తున్నానన్న బీ-టౌన్ సీనియర్ బ్యూటీ, గతంలో తాను చేసిన కామెంట్స్‌ని, మళ్లీ గుర్తు చేసుకుంది. తనని ఎవరైనా ‘గంభీరం’గా ఉన్నావని అనటం కంటే ‘సెక్సీ, స్పైసీ’ వంటి పదాలతో పొగిడితేనే పొంగిపోతానని చెబుతోంది. ప్రస్తుతం తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్న గార్జియస్ గాడెస్ ‘సెక్సీ’ విషయంలో మరో ఆసక్తికర విషయం కూడా చెప్పుకొచ్చింది. ‘సెక్సీ’గా ఉండటానికి తాను ప్రత్యేకంగా ప్రయత్నించదట. సహజంగానే ఆకర్షణీయంగా ఉండటం మలైకా అరోరా తత్వం అంటోంది! నిజమే... అటుఇటుగా 50 ఏళ్ల మైలురాయికి చేరుకుంటోన్న సూపర్ బ్యూటీ... న్యాచురల్‌గానే నాటీగా కనిపించటం... ప్రయత్నిస్తే వచ్చేదైతే కాదు మరి! 

Updated Date - 2022-03-11T01:07:10+05:30 IST