ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా భయమేసింది.. కానీ..: బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-03-11T19:17:45+05:30 IST

బాలీవుడ్‌లో బోల్డ్ ‌బ్యూటీగా పేరున్న నటీమణుల్లో మలైకా అరోరా ఒకరు. ఈ భామ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అర్భాజ్ ఖాన్..

ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా భయమేసింది.. కానీ..: బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్‌లో బోల్డ్ ‌బ్యూటీగా పేరున్న నటీమణుల్లో మలైకా అరోరా ఒకరు. ఈ భామ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అర్భాజ్ ఖాన్ మాజీ భార్య అనే విషయం తెలిసిందే. ఈ జంట 1998లో ప్రేమ వివాహం చేసుకోగా.. దాదాపు 19 సంవత్సరాల తర్వాత వివిధ కారణాలతో 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే వారికి పుట్టిన కొడుకు అర్హాన్ ఖాన్‌కి మాత్రం తల్లిదండ్రులుగా అవసరమైన సపోర్టు ఇస్తూనే ఉన్నారు. అయితే విడాకుల సమయంలో తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైక వివరించింది.


మలైకా మాట్లాడుతూ.. ‘నేను విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, నా కొడుక్కి సింగిల్ మదర్‌గా ఉండాల్సి వస్తుందని నాకు తెలుసు. అయితే నేను దాన్ని పట్టించుకోలేదు. కానీ ఆ సమయంలో తల్లిగా నీ బాధ్యతని ఎలా నిర్వహించబోతున్నావని ప్రపంచం మొత్తం అడుగుతున్నట్లు అనిపించింది. అది ఏ మనిషిలోనైనా కలిగే భావనే. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే నాకూ ఎదుగుతున్న కొడుకు ఉన్నాడు. గతంలో కంటే ఇప్పుడే వాడికి నా అవసరం ఎక్కువ. నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి. అతన్ని సరైన మార్గంలో నడిపించాలి. అలాగే సొంతంగా చేసిన తప్పుల ద్వారా జీవితం గురించి తెలుసుకునేలా అవకాశం ఇవ్వాలి. విడాకుల తర్వాత ఈ ఆలోచనలు అన్నీ నా మనసుని విపరీతంగా తొలిచేశాయి’ అని చెప్పుకొచ్చింది.


మలైకా ఇంకా మట్లాడుతూ.. ‘నిజంగా చెప్పాలంటే.. నాకు చాలా భయం వేసింది. బలహీనంగా అనిపించింది. ఈ భావనలతో చాలా రోజులు సతమతమయ్యాను. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. జీవితంలో, కెరీర్‌లో అనుకున్న స్థాయికి వెళ్లలేకపోయాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కెరీర్‌ గురించి కూడా పట్టించుకోవాలి. అలాగే నేను సింగిల్ మదర్‌ని. కానీ నేను పనిచేస్తున్న సింగిల్ మదర్‌ని. నా బాధ్యతను నేరవేర్చడం చూడా చాలా ముఖ్యం. అదే నన్ను కొన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకునేలా చేసింది’ అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-03-11T19:17:45+05:30 IST