అతనే నా మగాడు అంటోన్న Malaika Arora

ABN , First Publish Date - 2022-05-06T04:56:06+05:30 IST

‘నేక్స్ట్ ఏంటి?’ అని ఆలోచిస్తున్నారట మలైకా అరోరా, అర్జున్ కపూర్! తాము అలాంటి ఒక స్థితికి వచ్చేశామని అంటోంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ. అర్జున్ కపూర్ తో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతోన్న మలైకా తొలిసారి ఓపెన్ గా కొన్ని కామెంట్స్ చేసింది.

అతనే నా మగాడు అంటోన్న Malaika Arora

‘నేక్స్ట్ ఏంటి?’ అని ఆలోచిస్తున్నారట మలైకా అరోరా, అర్జున్ కపూర్! తాము అలాంటి ఒక స్థితికి వచ్చేశామని అంటోంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ. అర్జున్ కపూర్ తో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతోన్న మలైకా తొలిసారి ఓపెన్ గా కొన్ని కామెంట్స్ చేసింది. ‘వాట్ నెక్ట్స్’ అంటోన్న ఆమె ‘‘మేం ఇద్దరం కలసి ‘ఒకే భవిష్యత్తు’ని చూడాలని కోరుకుంటున్నాం... ఇక్కడ్నుంచీ మా బంధాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆలోచిస్తున్నాం...’’ అంటూ పరోక్షంగా పెళ్లి సంకేతాలు ఇచ్చింది. అయితే, మలైకా ఎక్కడా తామిద్దరం పెళ్లికి రెడీ అని తేల్చి చెప్పలేదు... 


అర్జున్ కపూర్ తనకు ఎంత ప్రత్యేకమో వివరించిన గార్జియస్ గాడెస్... ‘తను నా మగాడు’ అంటూ గర్వంగా, ఇష్టంగా ప్రకటించింది! ‘‘నాకు తెలుసు హీ ఈజ్ మై మ్యాన్’’ అనటమే కాదు... అర్జున్ తో కలసి తను పెరిగి పెద్దవ్వాలనుకుంటోందట! ‘ఐ వాంటూ గ్రో ఓల్డ్ విత్ యూ’ అని 36 ఏళ్ల అర్జున్ కపూర్ కి 48 ఏళ్ల మలైక చెబుతూ ఉంటుందట! 


కొన్నాళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మలైకా ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. యాక్సిడెంట్ తరువాత కారు ఎక్కాలంటేనే భయమేసేదట. తనని ఎంతో బతిమాలి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చేదని చెప్పింది మలైకా అరోరా. రణబీర్, ఆలియా పెళ్లికి కూడా బలవంతంగా కారు ఎక్కి వెళ్లానని వివరించింది! అయితే, కారు ప్రయాణాలకి బయపడుతోన్న సీనియర్ బ్యూటీ తన భాగస్వామితో ముందు, ముందు సుదీర్ఘ జీవన ప్రయాణానికి మాత్రం సిద్ధమవుతోంది! మలైక తాజా మాటలు చూస్తుంటే... ఆమె మిసెస్ అర్జున్ కపూర్ అవ్వటం... ఎంతో దూరంలో లేదంటున్నారు బీ-టౌన్ జనం! లెట్స్ వెయిట్ ఫర్ ద గుడ్ న్యూస్... 

Updated Date - 2022-05-06T04:56:06+05:30 IST