Malaika Arora: నా మనసుని ఫాలో అయ్యా.. హ్యాపీగా ఉన్నా.. విడాకులపై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-10-03T19:39:58+05:30 IST

పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో చేసిన ‘కెవ్వు కేక’ సాంగ్‌తో టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా (Malaika Arora)...

Malaika Arora: నా మనసుని ఫాలో అయ్యా.. హ్యాపీగా ఉన్నా.. విడాకులపై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ

‘గబ్బర్ సింగ్’ సినిమాలో చేసిన ‘కెవ్వు కేక’ సాంగ్‌తో టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా (Malaika Arora). ఈ బ్యూటీ కొన్నేళ్ల క్రితం నటుడు అర్బాజ్ ఖాన్‌ (Arbaaz Khan)తో విడాకులు (Divorce) తీసుకుని సేపరేటుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ ప్రస్తుతం తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్‌(Arjun Kapoor)తో రిలేషన్‌షిప్‌లో ఉంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. వారి అభిమానులు సైతం ఆ ప్రత్యేకమైన రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. విడాకులపై, ప్రస్తుతం మాజీ భర్తతో రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా స్పందించింది.


మలైకా మాట్లాడుతూ.. ‘నేను నా ఇష్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నా. నా మనసుకే మొదటి స్థానం ఇచ్చాను. అలా చేయడం ద్వారా.. ఈ రోజు ఇంకా మంచి వ్యక్తిగా అయ్యానని అనుకుంటున్నాను. నా కొడుకుతో నాకు మంచి సంబంధం ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నానని అతను చూస్తున్నాడు. నా మాజీ భర్తతో విడాకుల తర్వాత నా కొడుకుతో అనుబంధం ఇంకా పెరిగింది. అలాగే నా మాజీ భర్తతో కూడా నాకు చాలా మంచి రిలేషనే ఉంది’ అని తెలిపింది.


మలైకా ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నా ఇష్టప్రకారం నిర్ణయం తీసుకున్నందుకు సంతోష పడుతున్నాను. ఆ మాట మీదే ఇప్పటికీ నిలబడి ఉన్నాను. నిలబడతాను. అందుకే మహిళలు అందరూ భయపడకుండా.. వారి మనసుని ఫాలో అవ్వాలని కూడా చెబుతాను. జీవితం చాలా కష్టమైంది. ఇక్కడ అందరి సంతోష పెట్టడం కుదరదు’ అని చెప్పుకొచ్చింది.


కాగా.. అర్భాజ్ ఖాన్‌తో మలైకాకి 1998లో వివాహం కాగా.. 18 సంవత్సరాల తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకి అప్పటికే కొడుకు అర్హాన్ ఖాన్ ఉన్నాడు. అతను ప్రస్తుతం మలైకాతోనే ఉంటున్నాడు. మరోవైపు.. అర్బాజ్ ఖాన్ కూడా  జార్జియా ఆండ్రియాని అనే నటితో గత నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు.

Updated Date - 2022-10-03T19:39:58+05:30 IST