Prabhas పై రూ. 1200కోట్లకు పైగా బెట్టింగ్..!

ABN , First Publish Date - 2022-06-03T02:09:32+05:30 IST

‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమాతో ఆయనకు ఉత్తరాదిలోను విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా ప్రతి సినిమాను పాన్

Prabhas పై రూ. 1200కోట్లకు పైగా బెట్టింగ్..!

‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమాతో ఆయనకు ఉత్తరాదిలోను విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రభాస్ నుంచి చివరగా వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.  అయినప్పటికీ ‘బాహుబలి’ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలను నిర్మాతలు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వందల కోట్లను అవలీలగా ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్‌పై మేకర్స్ రూ. 1200కోట్లకు పైగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.      


ప్రభాస్ ప్రస్తుతం 'సలార్' (Salaar)లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ కిరంగదూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను రూ.200కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఆయన బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ‘ఆదిపురుష్’(Adipurush) లో నటిస్తున్నారు. ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే మేకర్స్ రూ. 500కోట్లకు పైన ఖర్చు పెట్టారు. పొస్ట్ ప్రొడక్షన్ పూర్తి అయ్యే లోపు ఈ బడ్జెట్ మరింత పెరిగే అంచనాలున్నాయి. వైజయంతీ మూవీస్‌తోను ప్రభాస్ ఓ మూవీ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-కె’(Project K) లో నటిస్తున్నారు. ఈ మూవీ సైన్స్ ఫిక్ష‌న్‌గా రూపొందుతోంది. ‘ప్రాజెక్ట్-కె’ ను రూ. 500కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నామని మేకర్స్ ఇప్పటికే పలు వేదికల్లో తెలిపారు. మరి, ఈ సినిమా పూర్తయ్యే లోపు ఎంత బడ్జెట్ పెరుగుతుంది అనే విషయం తెలియదు. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’, ‘ఆదిపురుష్’ సినిమాల బడ్జెటే రూ. 1000కోట్లను దాటేస్తుంది.'సలార్' పై కూడా రూ. 200కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ మూడు సినిమాలపై నిర్మాతలు ఇంచుమించు రూ.1200 కోట్లను వెచ్చిస్తున్నారు. ఒక హీరో పైన ఇంత ఖర్చు పెట్టడం అనేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి. అయితే, ఒక్క సరైన హిట్ పడితే రూ. 1000కోట్లు రాబట్టే సత్తా ప్రభాస్‌కు ఉందని మేకర్స్ భావిస్తున్నారు.

Updated Date - 2022-06-03T02:09:32+05:30 IST