నెట్‌ప్లిక్స్‌లో దూసుకెళ్తున్న Major

ABN , First Publish Date - 2022-07-15T22:31:42+05:30 IST

ప్రయోగాత్మక సినిమాలు, విభిన్న పాత్రలతో అలరిస్తున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). అతడు తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’(Major). 26/11 హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ (Sandeep

నెట్‌ప్లిక్స్‌లో దూసుకెళ్తున్న Major

ప్రయోగాత్మక సినిమాలు, విభిన్న పాత్రలతో అలరిస్తున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). అతడు తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’(Major). 26/11 హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ (Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. మహేశ్ బాబు(Mahesh Babu)కు చెందిన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. భారీ వసూళ్లను రాబట్టింది. అనంతం ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా దూసుకెళ్తుంది.

    

నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫాంలో ‘మేజర్’  14దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. కువైట్, బంగ్లాదేశ్, బహ్రైయిన్, మలేసియా, మాల్దీవులు, ఒమన్, పాకిస్థాన్, కతార్, సింగపూర్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. భారత్, నైజీరియా, మారిషస్‌లో నెం-1 పొజిషన్‌లో నిలిచింది. ఈ సినిమాలో అడివి శేష్ నటనకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ‘మేజర్’ లో సయీ మంజేక్రర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Updated Date - 2022-07-15T22:31:42+05:30 IST