Major: గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాతలు

ABN , First Publish Date - 2022-05-28T02:00:47+05:30 IST

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా.. శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా (Pan India) చిత్రం ‘మేజర్’ (Major). ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రమోషన్‌లో భాగంగా

Major: గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాతలు

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా.. శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా (Pan India) చిత్రం ‘మేజర్’ (Major).  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను రాబట్టుకుని.. సినిమా కోసం వేచి చూసేలా చేశాయి. అయితే ఈ సినిమా కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకు.. తాజాగా మేకర్స్ ఓ గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని మేజర్ చిత్ర నిర్మాతలు ప్రకటించారు.


తెలంగాణ (Telangana)లో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర రూ. 150 కాగా, ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో రూ. 147, మల్టీప్లెక్స్‌లలో తెలంగాణలో రూ. 195, ఆంధ్రప్రదేశ్‌లో రూ.177 గా ఉంటాయని తెలిపారు. పాండమిక్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో విడుదలవుతోన్న చిత్ర ఈ చిత్రమేనని మేకర్స్ తెలిపారు. చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతోనే టికెట్ ధరలను అందరికీ అందుబాటులో తెచ్చామని, ఈ నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో రిపీట్ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పిస్తుందని ఆశిస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.


కాగా, థియేట్రికల్ రిలీజ్‌కి ముందే దేశవ్యాప్తంగా ప్రీమియర్‌లను నిర్వహిస్తూ ‘మేజర్’ యూనిట్ మరో ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం పూణే(Pune)లో ఫస్ట్ స్క్రీనింగ్ నిర్వహించగా.. యూనానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ షో చూసిన ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్‌ ఇచ్చారు. 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ (Major Sandeep Unnikrishnan)కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు (Mahesh Babu) జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (GMB Entertainment), ఏ ప్లస్ ఎస్ మూవీస్‌(A+S Movies)తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా (Sony Pictures Films India) భారీగా నిర్మించింది.

Updated Date - 2022-05-28T02:00:47+05:30 IST