మేజర్‌కు పనిచేయడం గర్వంగా ఉంది

ABN , First Publish Date - 2022-05-26T06:44:56+05:30 IST

‘‘మేజర్‌’ లాంటి ఒక గొప్ప సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఉన్నికృష్ణన్‌ కథ అనగానే అప్పట్లో జరిగిన సంఘటన, ఆయన రూపం నా కళ్లముందు...

మేజర్‌కు పనిచేయడం గర్వంగా ఉంది

‘‘మేజర్‌’ లాంటి ఒక గొప్ప సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఉన్నికృష్ణన్‌ కథ అనగానే అప్పట్లో జరిగిన సంఘటన, ఆయన రూపం నా కళ్లముందు కదలాడింది. ఈ సినిమాలో లవ్‌స్టోరీ, పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయి’ అని శ్రీ చరణ్‌ పాకాల అన్నారు. అడివి శేష్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఆయన సంగీతం అందించారు. జూన్‌ 3న విడుదలవుతున్న సందర్భంగా సినిమా విశేషాలను ఆయన పంచుకున్నారు. 


‘డిజె టిల్లు’ చిత్రం తర్వాత ‘మేజర్‌’ చేయడం గొప్పగా భావిస్తున్నా. 


ఈ సినిమాలో డ్రామా, యాక్షన్‌, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ తోపాటు చాలా ఎమోషన్స్‌ ఉన్నాయి. అవే సినిమాకు హైలైట్‌.  ఇవి ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతాయి. నా కెరీర్‌ తొలినాళ్లలోనే బయోపిక్‌ చేయడం సంతోషంగా ఉంది. 


అడివి శేష్‌ నటించిన ‘కిస్‌’, ‘కర్మ’, ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాలకు సంగీతం అందించాను. ‘మేజర్‌’లో పాటలకు అనుగుణంగా ట్యూన్స్‌ ఉంటాయి. అలా ఉంటేనే ప్రేక్షకులను ఆ మూడ్‌లోకి తీసుకెళ్లగలం. 1990 నాటి కథ కావడంతో ఆ కాలానికి తగ్గట్లుగా సంగీతం వచ్చేలా ఎక్కువ శ్రద్ధ పెట్టాను. దర్శకుడు కథ చెప్పగానే నాకు చాలా ఎగ్జైట్‌మెంట్‌గా అనిపించింది.  నేటియువత తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘మేజర్‌’. దర్శకుడు సెట్‌లో చాలా కూల్‌గా ఉంటారు. కానీ టేకింగ్‌లో తన సత్తా చూపించారు. సబ్జెక్ట్‌ డీల్‌ చేయడంలో ఆయన గ్రేట్‌.  


నేపథ్య సంగీతం చేయడంలో ఓ కిక్‌ ఉంటుంది. కానీ పాటలకు సంగీతం అందించడం అంటేనే నాకు ఇష్టం. ఇప్పటిదాకా థ్రిల్లర్‌, కమర్షియల్‌ చిత్రాలకు సంగీతం అందించాను. మాస్‌, కామెడీ సినిమాలకు పనిచేయాలనుంది. 


మ్యూజిక్‌ పరంగా ఎప్పటికప్పడు అప్‌డేట్‌ అవుతాను. ప్రస్తుతం అల్లరి నరేష్‌తో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘గూఢచారి 2’, ‘తెలిసినవాళ్లు’, ‘ఎవరు’ అనే (కన్నడ) చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను.  


Updated Date - 2022-05-26T06:44:56+05:30 IST