Mahesh: మహేశ్ - త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది అప్పుడేనా..?

ABN , First Publish Date - 2022-05-06T13:33:47+05:30 IST

గత కొంతకాలంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్నారు. ఆయన ఓ సినిమా పూర్తవుతుండగానే మరో సినిమాను సెట్స్‌పైకి తెచ్చేలా పక్కా ప్లాన్‌తో ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Mahesh: మహేశ్ - త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది అప్పుడేనా..?

గత కొంతకాలంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్నారు. ఆయన ఓ సినిమా పూర్తవుతుండగానే మరో సినిమాను సెట్స్‌పైకి తెచ్చేలా పక్కా ప్లాన్‌తో ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అలాగే, రెండు ప్రాజెక్ట్స్‌ను రెడీ చేసుకున్నారు. అందులో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చేయనున్న హ్యాట్రిక్ సినిమా అయితే, మరొకటి పాన్ ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (S S Rajamouli) దర్శకత్వంలో కమిటయిన సినిమా. ఈ రెండు సినిమాలను పక్కాగా సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు మహేశ్ డేట్స్ సర్దుబాటు చేశారట.


ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందిన సర్కారు వారి పాట ( Sarkaruvaari Paata) సినిమాని ఈ నెల 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేశ్ (Keerthi Suresh) మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, సముద్ర ఖని, నదియా, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్  బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.


ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్‌తో మహేశ్ ఖాతాలో మరో భారీ పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మహేశ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయో నెక్స్ట్ సినిమాను జూన్ నుంచి సెట్స్ మీదకు తీసుకు రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, తాజా సమాచారం మేరకు జూలై నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయట. అప్పటి వరకు కంప్లీట్ స్క్రిప్ట్‌తో పాటు నటీ నటుల ఎంపిక..లోకేషన్స్‌ను.. షెడ్యూల్స్‌ను ఫైనల్ చేసుకొని నాన్ స్టాప్‌గా చిత్రీకరణ జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత రాజమౌళి మూవీ కోసం మహేశ్ రెడీ అవుతారని సమాచారం. 

Updated Date - 2022-05-06T13:33:47+05:30 IST