India Day Parade in US: మహేష్ వద్దంటే అల్లు అర్జున్.. ఏది నిజం?

ABN , First Publish Date - 2022-09-03T19:50:20+05:30 IST

అమెరికాలో న్యూయార్క్లో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి మొదట మహేష్ బాబుని పిలిచారని, దానికి ఆయన ‘నో’ అంటేనే.. బన్నీకి ఆహ్వానం అందిందనే వార్త ఇటీవల మీడియాలో వచ్చింది.

India Day Parade in US: మహేష్ వద్దంటే అల్లు అర్జున్.. ఏది నిజం?

అమెరికాలో న్యూయార్క్లో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి మొదట మహేష్ బాబు(mahesh)ని పిలిచారని, దానికి ఆయన ‘నో’  అంటేనే.. బన్నీకి (Allu arjun) ఆహ్వానం అందిందనే వార్త ఇటీవల మీడియాలో వచ్చింది. అయితే, అది ఫేక్ న్యూస్ అని, మహేష్ బాబు అభిమానులు, ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడబలుక్కొని చేసిన దుష్ప్రచారమే తప్ప అందులో నిజం లేదనీ తెలిసింది. 


ఇటువంటి వార్తల విషయంలో నిజానిజాల నిర్ధారణకి సంబంధిత నటుల మేనేజర్ వంటి వ్యక్తిగత సిబ్బందిని వివరణ కోరడం రివాజు. కానీ, ఆ నటీనటుల వ్యక్తిగత సిబ్బంది, లేదా నిర్మాతల ప్రొడక్షన్ హౌస్ టీమ్ కూడా ఆ అబద్ధపు ప్రచారంలో భాగం కావడం చాల పెద్ద తప్పని పలువురు విమర్శిస్తున్నారు. 


న్యూయార్క్ నగరంలో అట్టహాసంగా జరిగిన ఇండియా డే పరేడ్ (India Day Parade)లో గ్రాండ్ మార్షల్ (Grand Marshal) హోదాలో అల్లు అర్జున్ పాల్గొనడం మనకి ఎంతో గర్వకారణం. అయితే, మహేష్ ని గొప్ప చేయడానికి ఆయననే ముందు ఆహ్వానించారని, ఆయన కుదరదని చెప్పిన తర్వాతే బన్నీకి పిలుపు వెళ్లిందనీ మహేష్ టీమ్ ప్రచారం చేసింది. అలాంటి తప్పుడు సమాచారం స్ప్రెడ్ చెయ్యటం వల్ల బన్నీకి ఏమి చెడ్డ పేరు రాదు, సరికదా ఆయన మీద మరింత అభిమానం పెరుగుతుంది. అల్లు అర్జున్ న్యూయార్క్ వెళ్లి అక్కడ గ్రాండ్ మార్షల్ గా పార్టిసిపేట్ చెయ్యటం అది భారతీయుడిగా గర్వించాలి, అందులోకి మన తెలుగు వాడు అవ్వటం మనం ఇంకా పొంగిపోవాలి. కానీ ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వల్ల మహేష్ ఎటువంటి లాభం లేకపోగా, నిజం తెలిశాక మహేష్ కే చెడ్డపేరు, మహేష్ బాబుకే అది చేటు చేస్తుందని ఆయన కోటరి గ్రహించాలి.

Updated Date - 2022-09-03T19:50:20+05:30 IST