Mahesh - Rajamouli: ఈ ఏడాది ప్రారంభం..2024 లో రిలీజ్..?

ABN , First Publish Date - 2022-03-06T15:12:13+05:30 IST

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

Mahesh - Rajamouli: ఈ ఏడాది ప్రారంభం..2024 లో రిలీజ్..?

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ మూవీపై అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. సౌత్ స్టార్స్‌తో పాటు బాలీవుడ్ హాలీవుడ్ స్టార్స్ నటించిన ఆర్ఆర్ఆర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ సృష్ఠించడం ఖాయమని అన్నీ సినిమా ఇండస్ట్రీలలోని ప్రముఖులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంత నమ్మకం ఉంది రాజమౌళి సినిమా మీద.


కాగా, ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోయే మరో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఈ ఏడాదే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఆయన తండ్రి, అగ్ర రచయిత - దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ మహేశ్ మూవీ కోసం పాన్ ఇండియా స్థాయి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డా. కె.ఎల్. నారాయణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అయితే, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను 2024 విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు కూడా ఇప్పటి నుంచే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మహేశ్ ఇప్పుడు చేస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను చేస్తారు. ఇక ఆ తర్వాత మహేశ్ డేట్స్ మొత్తం రాజమౌళి సినిమాకే కేటాయించారని తెలుస్తోంది. 

Updated Date - 2022-03-06T15:12:13+05:30 IST