Mahesh Babu: సూపర్ స్టార్ స్టన్నింగ్ లుక్ నెట్టింట వైరల్..

ABN , First Publish Date - 2022-08-14T16:43:48+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మహేష్ తన ప్రతీ సినిమాకు ఓ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్న సంగతి తెల్సిందే.

Mahesh Babu: సూపర్ స్టార్ స్టన్నింగ్ లుక్ నెట్టింట వైరల్..

టాలీవుడ్ సూపర్ స్టార్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మహేశ్ తన ప్రతీ సినిమాకు ఓ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్న సంగతి తెల్సిందే. సినిమా సినిమాకు కథ ఎంత వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారో..ఆ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా ఎంత కొత్తగా కనిపిస్తే అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటారో అలా ట్రై చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మహేశ్ సతీమణి నమ్రత (Namratha) సహకారం ఎక్కువగా ఉంటుందనీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


మురారి, అతడు, పోకిరి, సరిలేరు నీకెవ్వరు ..ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాలే మహేశ్ మేకోవర్ గురించి మాట్లాడుకోవడానికి కొన్ని ఉదాహరణలు. ఈ మూవీస్‌లో మహేశ్ లుక్ గురించే ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. ఇక ఆయన చేసే కమర్షియల్ యాడ్ ఫిలింస్‌లోనూ లుక్ పరంగా సరికొత్త హేయిర్ స్టైల్..కాస్ట్యూంస్ ట్రై చేస్తుంటారు. అలాగే, ఇప్పుడు మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


త్వరలో ఆయన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చేయనున్న సినిమా సెట్స్ మీదకు రాబోతోంది. ఈ మూవీ కోసమే మహేశ్ ఇలా సరికొత్తగా మేకోవర్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. మరికొందరేమో ఇది మహేష్ చేసిన ఓ కమర్షియల్ యాడ్ ఫిల్మ్ లోని లుక్ అంటున్నారు. ఈ లుక్ దేనికోసమో క్లారిటీ లేనప్పటికీ మహేశ్ మాత్రం మునుపెన్నడూ లేనివిధంగా కంప్లీట్ ట్రెండీ లుక్‌లో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్‌ను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

Updated Date - 2022-08-14T16:43:48+05:30 IST