‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై సూపర్ స్టార్ స్పందన ఇదే..

ABN , First Publish Date - 2021-12-10T18:56:47+05:30 IST

గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌.. మరోసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయి, స్థానం పెంచే సినిమా దర్శకధీరుడు రాజమౌళి నుండి వస్తున్నట్లుగా తెలియజేసింది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ‘గూస్‌బంప్స్’ అంటూ..

‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై సూపర్ స్టార్ స్పందన ఇదే..

గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌.. మరోసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయి, స్థానం పెంచే సినిమా దర్శకధీరుడు రాజమౌళి నుండి వస్తున్నట్లుగా తెలియజేసింది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ‘గూస్‌బంప్స్’ అంటూ రియాక్ట్ అవుతున్నారంటే.. ఎంతగా ఈ ట్రైలర్ జనాల్లోకి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆడా, ఇడా అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా? అని ప్రతి ఒక్కరూ కాచుకుని కూర్చున్నారు. అంతగా రాజమౌళి ఈ ట్రైలర్‌తో మెస్మరైజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘మైండ్ బ్లోయింగ్.. ట్రైలర్‌లోని ప్రతి ఒక్క షాట్ స్టన్నింగ్’ అంటూ ట్వీట్ చేశారు.


కాస్త లేట్‌గా స్పందించినా.. లేటెస్ట్‌గా స్పందించారు సూపర్ స్టార్. ‘‘అద్భుతం.. మైండ్ బ్లోయింగ్.. ట్రైలర్‌లోని ప్రతి ఒక్క షాట్ స్టన్నింగ్‌గా ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ మళ్లీ వచ్చేశాడు.. ఇది ఎలా సాధ్యం? ట్రైలర్ చూస్తున్నంత సేపూ గూస్‌బంప్సే!’’ అని ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై మహేష్ బాబు ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-12-10T18:56:47+05:30 IST