Mahesh Babu : మళ్ళీ ద్విపాత్రాభినయం?

ABN , First Publish Date - 2022-05-30T14:49:32+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata) చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నారు. సినిమా రికార్డు కలెక్షన్స్ రాబట్టి.. అభిమానుల్ని ఖుషీ చేసింది. ఇక మహేశ్ తదుపరి చిత్రంపై అంతటా ఆసక్తి నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మహేశ్ కెరీర్ లో 28వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఈ చిత్రానికి ‘అర్జునుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ను ఖాయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

Mahesh Babu : మళ్ళీ ద్విపాత్రాభినయం?

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata) చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నారు. సినిమా రికార్డు కలెక్షన్స్ రాబట్టి.. అభిమానుల్ని ఖుషీ చేసింది. ఇక మహేశ్ తదుపరి చిత్రంపై అంతటా ఆసక్తి నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మహేశ్ కెరీర్ లో 28వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఈ చిత్రానికి ‘అర్జునుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ను ఖాయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.  ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. SSMB 28 లో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇదో పీరియాడిక్ డ్రామా అని, ఫ్లాష్ బ్యాక్‌లోనూ, వర్తమానంలోనూ ఆ రెండు పాత్రలు కనిపిస్తాయని టాక్. జూలై నెల్లో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందని సమాచారం. మొదట ఒక ఫైట్ సీన్ తో షూటింగ్ ప్రారంభం కానుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్ చిత్రీకరణ జరుపుకోనుంది. 


నిజానికి మహేశ్ (Mahesh) బాలనటుడిగా ఉన్నప్పుడే, కృష్ణ (Krishna) దర్శకత్వంలో వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’ (Kodukudiddina Kapuram) చిత్రంలో తన కెరీర్ లోనే తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. విడిపోయిన తల్లిదండ్రుల్ని కవల పిల్లలైన మహేశ్ బాబు ద్వయం కలుపుతుంది. అప్పట్లో ఆ సినిమా సూపర్‌హిట్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్ళకు .. మహేశ్ సూపర్ స్టార్ అయ్యాకా మరోసారి ద్విపాత్రాభినయం చేయనుండడం విశేషం. ‌‌‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రానున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్. ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో’ చిత్రాలతో త్రివిక్రమ్ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న నేపథ్యంలో SSMB 28 చిత్రంపై రెట్టింపు హైపు క్రియేట్ అయింది. మరి ఈ సినిమాలో మహేశ్ నిజంగానే డ్యూయల్ రోల్స్ చేస్తాడో లేదో చూడాలి.  

Updated Date - 2022-05-30T14:49:32+05:30 IST