Mahesh Babu: రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?.. ఇదిగో రుజువు..

ABN , First Publish Date - 2022-09-27T22:51:50+05:30 IST

టాలీవుడ్ స్టార్స్ ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రాబోయే సినిమా గురించి..

Mahesh Babu: రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?.. ఇదిగో రుజువు..

టాలీవుడ్ స్టార్స్ ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రాబోయే సినిమా గురించి.. దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా కావడంతో.. అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాకుండా.. మొదటిసారి మహేశ్ బాబుతో కలిసి చేసే సినిమా కావడంతో ఆ అంచనాలు భారీగా పెరిగాయి. ఈ తరణంలో ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటికి వస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.


ఇంతకుముందే.. ఆఫ్రికన్ బ్యాక్‌‌డ్రాప్‌లో సినిమా కథ ఉండాలనే ఆలోచన ఉందని రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పడం తెలిసిందే. అనంతరం ఓ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను మహేశ్ బాబుతో చేయబోయే సినిమా గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తాను. అది భారతీయ మూలాలున్న జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్‌లాగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. దాంతో.. ఈ మూవీలో మహేశ్ బాబు ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ తరుణంలో ఈ మూవీ గురించి ఇటీవలే ఓ క్రేజీ వార్త బయటికి వచ్చి అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది.


ఈ మూవీలో హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిస్ హేమ్స్‌వర్త్ (Chris Hemsworth) ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ అందులో ఎంతవరకూ నిజం ఉందో ఎవరికీ తెలియదు. చాలామంది అయితే అది కేవలం రూమరే కావొచ్చని ఫిక్స్ అయ్యారు. ఈ తరుణంలో క్రిస్ హేమ్స్‌వర్త్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్ బాబు ఫాలో అవుతున్నాడు. నిజానికి 88 లక్షల ఫాలోవర్స్ ఉన్న మహేశ్.. కేవలం 63 మందిని మాత్రమే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడు. అందులో రాజమౌళి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి పలువురు ప్రముఖులతో పాటు క్రిస్ హేమ్స్‌వర్త్ కూడా ఉన్నాడు. దీంతో ఆ వార్త నిజమేనని ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా.. చాలామంది ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. అదే జరిగితే.. రాజమౌళి, మహేశ్ కాంబో సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని సంతోషపడుతున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.



Updated Date - 2022-09-27T22:51:50+05:30 IST