SSMB 28: కీప్ కామ్ అండ్ ట్రస్ట్ త్రివిక్రమ్!

ABN , First Publish Date - 2022-07-10T01:35:14+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం రిలీజై 2 నెలలు అవుతుంది. మహేశ్ ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.. త్రివిక్రమ్ కథకి పదును పెట్టె పనిలో ఉన్నాడు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళాల్సిన

SSMB 28: కీప్ కామ్ అండ్ ట్రస్ట్ త్రివిక్రమ్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం రిలీజై 2 నెలలు అవుతుంది. మహేశ్ ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.. త్రివిక్రమ్ కథకి పదును పెట్టె పనిలో ఉన్నాడు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళాల్సిన SSMB 28 సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని.. ఎదురుచూస్తున్న వారి కోసం తాజాగా ఆ చిత్ర మేకర్స్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలిపి.. కాస్త టెన్షన్ తగ్గించారు. ఎందుకంటే.. మరో వైపు రాజమౌళి, మహేశ్ సినిమా ప్రీవిజువలైజేషన్ వర్క్స్ స్టార్ట్ చేసేశాడు. రాజమౌళి సినిమాకి బల్క్ డేట్స్ కావాలి, ఇలాంటి టైంలో మహేశ్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది, ఇలానే ఇంకో నెల గడిస్తే... అసలు SSMB 28 ఉంటుందా లేదా అనే డౌట్ కూడా క్రియేట్ అయ్యే ప్రమాదం ఉందని ఘట్టమనేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన అప్‌డేట్ కాస్త ఉపశమనాన్ని కలిగించేదే. 


తమ హీరో సినిమా నుంచి అప్డేట్ రావాలి అని ఏ ఫ్యాన్ అయినా కోరుకుంటాడు కానీ.. త్రివిక్రమ్ తర్వాత మహేశ్ తర్వాత చేయబోయేది రాజమౌళి సినిమానే. పక్కాగా 2, 3 సంవత్సరాలు మహేశ్‌ని స్క్రీన్ పైన చూసే అవకాశమే ఉండదు. అన్ని రోజులు మహేశ్‌ని ఆన్ స్క్రీన్‌పై చూడకుండా అభిమానులు ఉండాలి అంటే.. వారికి ఎలాంటి లోటు లేని ఒక సాలిడ్ హిట్ కావాలి. అందుకే త్రివిక్రమ్ సినిమాపై వాళ్లు చాలా హోప్స్ పెట్టుకున్నారు. నిజానికి త్రివిక్రమ్, మహేశ్‌తో ఇప్పటివరకూ ఒక్క బాక్సాఫీస్ హిట్ కూడా ఇవ్వలేదు. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు టీవీలో హిట్ అయ్యాయి కానీ థియేటర్స్‌లో విజయం సాధించలేదు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండు సినిమాలు చివరికి నష్టాలే మిగిల్చాయి. అయినా కూడా మహేశ్ ఫ్యాన్స్ త్రివిక్రమ్‌నే నమ్మడానికి కారణం... ‘అతడు’ మరియు ‘ఖలేజా’ సినిమాల్లో మహేశ్‌కి త్రివిక్రమ్ ఇచ్చిన ఎలివేషన్.. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్ ఇవ్వలేదు. 


27 సినిమాల్లో మహేశ్‌ని అందరూ సూపర్ స్టార్ అనే అన్నారు కానీ... త్రివిక్రమ్ మాత్రమే మహేశ్‌ని.. ‘పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే’ అన్నాడు. ‘దైవం మానుష్య రూపేనా’ అని చూపించాడు. అందుకే SSMB 28 ప్రాజెక్ట్ ఆలస్యమైనా పర్లేదు, కీప్ కామ్ అండ్ ట్రస్ట్ త్రివిక్రమ్ రైటింగ్. అతను ఈసారి మహేశ్‌కి ష్యూర్ షాట్ హిట్ ఇవ్వడమే కాదు, మహేశ్ పాన్ ఇండియా మార్కెట్ సొంతం చేసుకోవడానికి అవసరమయ్యే గ్రౌండ్ ని కూడా ప్రిపేర్ చేస్తాడు.

Updated Date - 2022-07-10T01:35:14+05:30 IST