Maheshbabu: నా అర్హత సరిపోదు!

ABN , First Publish Date - 2022-07-03T05:55:23+05:30 IST

కమల్‌హాసన్‌ కీలక పాత్రలో నటించిన ‘విక్రమ్‌’ చిత్రంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతో నచ్చిందని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. జూన్‌ 3న విడుదలైన ‘విక్రమ్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కమల్‌హాసన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

Maheshbabu: నా అర్హత సరిపోదు!

కమల్‌హాసన్‌ (Kamal hassan) కీలక పాత్రలో నటించిన ‘విక్రమ్‌’ చిత్రంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Maheshbabu)ప్రశంసల వర్షం కురిపించారు. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతో నచ్చిందని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. జూన్‌ 3న విడుదలైన ‘విక్రమ్‌’ (VIkram)బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కమల్‌హాసన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌ ట్వీట్‌ చేశారు. (Mahesh tweet about vikram movie)


‘‘విక్రమ్‌’ న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. లోకేశ్‌ కనగరాజ్‌.. నేను మిమ్మల్ని కలిసి, విక్రమ్‌ మొదలైనప్పటి నుంచి చివరి వరకూ చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకుంటా. అన్ని రకాలుగా మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించింది. లెజెండరీ యాక్టర్‌ కమల్‌హాసన్‌గారి నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు నా అనుభవం సరిపోదు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉంది.  ఫహద్‌ ఫాజిల్‌,  విజయ్‌ ేసతుపతి నటనలో మెరుపులు కనిపించాయి. అనిరుధ్‌ కెరీర్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించాడు. చాలాకాలం తర్వాత ‘విక్రమ్‌’ నా ప్లే లిస్ట్‌లో టాప్‌లో ఉంది. కమల్‌ సర్‌... మీకు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ చిత్రం స్ర్టీమింగ్‌ కానుంది.




Updated Date - 2022-07-03T05:55:23+05:30 IST