మహేశ్ - రాజమౌళి చిత్రం లాంఛింగ్ అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-04-25T16:51:53+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల మహా మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తారక్, చెర్రీలను తొలిసారిగా హీరోలుగా వెండితెరపై ఓ రేంజ్‌లో ఎలివేట్ చేయడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇక ఇప్పుడు జక్కన్న తదుపరి చిత్రంపైనే ఉంది అందరి దృష్టి. ఆయన తర్వాత చేయబోయేది మహేశ్ బాబుతోనే అని అందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ తొలిసారిగా నటిస్తున్న చిత్రం అవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుంది అనే విషయంలోనూ మామూలు ఆసక్తి లేదు.

మహేశ్ - రాజమౌళి చిత్రం లాంఛింగ్ అప్పుడేనా?

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల మహా మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తారక్, చెర్రీలను తొలిసారిగా హీరోలుగా వెండితెరపై ఓ రేంజ్‌లో ఎలివేట్ చేయడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు.  ఇక ఇప్పుడు జక్కన్న తదుపరి చిత్రంపైనే ఉంది అందరి దృష్టి. ఆయన తర్వాత చేయబోయేది మహేశ్ బాబుతోనే అని అందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ తొలిసారిగా నటిస్తున్న చిత్రం అవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుంది అనే విషయంలోనూ ఆసక్తి  మామూలుగా లేదు. గతంలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లోని అడ్వెంచరస్ స్టోరీని మహేశ్ బాబు కోసం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సౌత్ ఆఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ కు తను, రాజమౌళి అభిమానులమని.. ఆయన స్ఫూర్తితోనే ఓ కథను రెడీ చేస్తున్నట్టు కూడా తెలిపారు విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం  ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. 


తాజా సమాచారం ప్రకారం మహేశ్, జక్కన్న మూవీ ఈ దసరాకి గ్రాండ్‌గా లాంఛ్ కానుందట. ఆలోపు స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేయబోతున్నారట. గత చిత్రాల్లాగానే ఈ సినిమాకి కూడా రాజమౌళి ఎక్కువ రోజులే టైమ్ తీసుకుంటున్నారని టాక్. మహేశ్ సైతం ఆయనకి బల్క్ డేట్స్ ఇచ్చి అన్ని రోజులూ లాక్ కాబోతున్నారు. ఆ లోపు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని కంప్లీట్ చేయబోతున్నారు మహేశ్. హారిసన్ ఫోర్డ్ హాలీవుడ్ సిరీస్ ‘ఇండియానా జోన్స్’ తరహాలోని అడ్వంచరస్ మూవీగా ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో మహేశ్ ను రాజమౌళి ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడో చూడాలి. 

Updated Date - 2022-04-25T16:51:53+05:30 IST