Newyork నగరవీధుల్లో మహేశ్, నమ్రత దంపతులు

ABN , First Publish Date - 2022-07-06T20:22:08+05:30 IST

ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata) చిత్రంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్ళు రాబట్టింది.

Newyork నగరవీధుల్లో మహేశ్, నమ్రత దంపతులు

ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata) చిత్రంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్ళు రాబట్టింది. దీని తర్వాత మహేశ్.. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని చేయబోతున్నాడు. సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అయితే ఈ గ్యాప్ లో మహేశ్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. 


ఏ మాత్రం వీలు దొరికినా తన ఫ్యామిలీతో సహా విదేశాల్లో వాలిపోవడం మహేశ్‌కు పరిపాటి. ఈ సారి సూపర్ స్టార్ ఫ్యామిలీ న్యూయార్క్ మహానగరాన్ని చుట్టుముడుతుండడం విశేషం. ప్రస్తుతం న్యూయార్క్ నగర వీధుల్లో మహేశ్, నమ్రత జంట దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా నమ్రత శిరోద్కర్ (Namratha Shirodkar) తన ఇన్ స్టా ఖాతాలో ఈ ఫోటోను షేర్ చేసి అభిమానుల్ని ఖుషీ చేసింది. మహేశ్, నమ్రత దంపతులు ఇచ్చిన ఈ స్టైలిష్ పోజుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 


‘సర్కారువారి పాట’ చిత్రంలో ‘పోకిరి’ (Pokiri) హెయిర్ స్టైల్లో కనిపించి.. అభిమానుల్ని అలరించిన మహేశ్ .. ఇప్పుడు ఈ ఫోటోలో తన హెయిర్ స్టైల్‌ను మరింత స్టైలిష్ గా మార్చేశాడు. దీనికి తోడు క్లీన్ షేవ్ మహేశ్ ను మరింత హ్యాండ్సమ్ గా మార్చేసింది. బహుశా ఈ గెటప్ త్రివిక్రమ్ సినిమా కోసం అయి ఉండొచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. ఆగస్ట్ లో మహేశ్, త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు టాక్. అతడు (Athadu), ఖలేజా (Khaleja) చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రానున్న మూడో చిత్రం హ్యాట్రిక్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 



Updated Date - 2022-07-06T20:22:08+05:30 IST