Kangana Ranaut ను నాచనేవాలీ(ఐటం గర్ల్) అంటూ విమర్శించిన మహారాష్ట్ర మంత్రి

ABN , First Publish Date - 2021-11-19T00:03:58+05:30 IST

బాలీవుడ్ స్టార్ నటి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. భారత స్వాతంత్ర్య సమరంపై

Kangana Ranaut ను నాచనేవాలీ(ఐటం గర్ల్) అంటూ విమర్శించిన మహారాష్ట్ర మంత్రి

బాలీవుడ్ స్టార్ నటి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. భారత స్వాతంత్ర్య సమరంపై ఆమె వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. భారత్‌కు స్వాతంత్య్రం అనేది 2014లోనే వచ్చిందని, 1947లో మనకు లభించింది భిక్ష మాత్రమే అని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో ఆమెను రాజకీయ నాయకులందరూ విమర్శించడం మొదలుపెట్టారు. ఆమెకిచ్చిన పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. కంగనను విలాసవంతమైన బిచ్చగత్తెగా సీపీఐ నారాయణ అభివర్ణించారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడైన విజయ్ వాడ్డెటివార్ ఆమెను నాచ్‌నేవాలీ (ఐటం గర్ల్ )అని విమర్శించాడు. 


ఆమెకు వ్యతిరేకంగా అనేక కేసులు దాఖలయ్యాయి. అయినా ఆమె మాత్రం వెనక్కి తగ్గడంలేదు. మహాత్మాగాంధీని ప్రస్తావిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టా‌స్టోరీ అగ్నికి అజ్యం పోసింది. ‘‘ కొంత మంది నాయకులు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెట్టామన్నారు. ఆ విధంగా చేస్తే మనకు స్వాతంత్య్రం వస్తుందన్నారు. అలా చేయడం వల్ల ఎవరికీ స్వాతంత్య్రం రాదు. ఆ విధంగా వచ్చింది భిక్ష మాత్రమే. అందువల్ల మీ హీరోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి’’ అని కంగనా రనౌత్  సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.  


మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడైన విజయ్ వాడ్డెటి వార్ ఆమెను తీవ్రంగా విమర్శించాడు. ‘‘ గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి. ఒక నాచ్‌నేవాలీ (ఐటంగర్ల్) చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదు. ఆమె గురించి చర్చించుకోనవసరం లేదు ’’ అని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-11-19T00:03:58+05:30 IST