సుమన్‌ ‘మహారాజు’

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

సీనియర్‌ నటుడు సుమన్‌ హీరోగా నటించే ‘మహారాజు’ చిత్రం షూటింగ్‌ ఇటీవల మొదలైంది.

సుమన్‌ ‘మహారాజు’

సీనియర్‌ నటుడు సుమన్‌ హీరోగా నటించే ‘మహారాజు’ చిత్రం షూటింగ్‌ ఇటీవల మొదలైంది. ఇంతకుముందు ‘అల్లుడు బంగారం’, ‘అంతేనా.. ఇంకేం కావాలి’ చిత్రాలను నిర్మించిన వెంకట నరసింహ రాజ్‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘మహారాజు’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఆర్‌.చందర్‌రావు, సంగీతం: శ్రీ వెంకట్‌, పాటలు: కాసర్ల శ్యామ్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, సహ నిర్మాత: సి.ఈశ్వర్‌ రెడ్డి. 

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST