Minister comments on Arjun Kapoor: మీరు ప్రేక్షకులను బెదిరించడం మానేసి.. యాక్టింగ్ నేర్చుకుంటే మంచిది

ABN , First Publish Date - 2022-08-19T16:14:37+05:30 IST

ప్రస్తుతం బాలీవుడ్‌లో బాయ్‌కాట్ (Boycott) కల్చర్ నడుస్తున్న విషయం తెలిసిందే. దాని కారణంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన..

Minister comments on Arjun Kapoor: మీరు ప్రేక్షకులను బెదిరించడం మానేసి.. యాక్టింగ్ నేర్చుకుంటే మంచిది

ప్రస్తుతం బాలీవుడ్‌లో బాయ్‌కాట్ (Boycott) కల్చర్ నడుస్తున్న విషయం తెలిసిందే. దాని కారణంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్ హీరోలు ఆమీర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ భారీ ఫ్లాపులుగా మిగిలాయి. దీంతో ఈ బాయ్‌కాట్ బాలీవుడ్ కల్చర్‌పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. అందులో బోనీ కపూర్ తనయుడు, యువ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) కూడా ఉన్నాడు.


అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రజలు మన గురించి వ్రాసేవి లేదా ట్రెండ్ చేసే హ్యాష్‌ట్యాగ్‌లు వాస్తవికతకు దూరంగా ఉన్నాయి. అందుకే మనం (బాలీవుడ్ సెలబ్రిటీలు) కలిసి పని చేసి దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. మా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుండడానికి కారణం మా ఇంటి పేర్లు కాదు. మా యాక్టింగ్ స్కిల్స్. బాయ్‌కాట్ ట్రెండ్‌ని అనేది చాలా దారుణం’ అని చెప్పుకొచ్చాడు.


ఈ కామెంట్స్ పై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా (Narottam Mishra) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఒక ఫ్లాప్ నటుడు ప్రజలను బెదిరిచడం సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. ప్రేక్షకులను బెదిరించే బదులు, ఆయన తన నటనపై దృష్టి పెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. నాకు ఓ సందేహం ఉంది. ఆయన, ఆయనకి సపోర్టుగా నిలిచే గ్యాంగ్‌కి మరో మతంపై సినిమా తీసి.. వారి దేవుళ్లకి వ్యతిరేకంగా సంభాషణలు పలకగలరా?. మీరు సనాతన ధర్మంపై మాత్రం ఇవన్నీ చేస్తారు. ప్రజలు మీ చిత్రాలను బహిష్కరించినప్పుడు వారిని బెదిరిస్తారు. అర్జున్ గారు.. ఇప్పుడు జనాలకు అవగాహన పెరిగింది’ అని అర్జున్‌కి కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Updated Date - 2022-08-19T16:14:37+05:30 IST