సినిమా చూసేందుకోసం రాష్ట్ర పోలీసులందరికీ ఒక రోజు సెలవు!

ABN , First Publish Date - 2022-03-15T02:06:31+05:30 IST

వారి, వారి కుటుంబాలతో సహా సినిమా చూసేందుకు రాష్ట్రంలోని పోలీసులందరికీ ఒక రోజు సెలవు! ఏ పోలీసు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు, ఒక రోజు లీవ్ తీసుకుని... మూవీకి వెళ్లవచ్చు! ఇంతకీ, ఇదంతా ఎక్కడా అంటారా? మన తెలంగాణ, ఆంధ్రాల్లో...

సినిమా చూసేందుకోసం రాష్ట్ర పోలీసులందరికీ ఒక రోజు సెలవు!

వారి, వారి కుటుంబాలతో సహా సినిమా చూసేందుకు రాష్ట్రంలోని పోలీసులందరికీ ఒక రోజు సెలవు! ఏ పోలీసు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు, ఒక రోజు లీవ్ తీసుకుని... మూవీకి వెళ్లవచ్చు! ఇంతకీ, ఇదంతా ఎక్కడా అంటారా? మన తెలంగాణ, ఆంధ్రాల్లో కాదులెండి. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు దక్కుతోన్న ప్రోత్సాహం!


మధ్యప్రదేశ్‌ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా నేరుగా రాష్ట్ర డీజీపీనే ఆదేశించారట. 1990నాటి కాశ్మీరీ పండిట్ల ఊచకోత ఉదంతం నేపథ్యంలో రూపొందిన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రతీ పోలీస్ చూసే విధంగా చర్యలు తీసుకోమన్నారని సమాచారం. అందుకు తగ్గట్టుగా పోలీసులు తమతమ కుటుంబాలతో సినిమాకు వెళ్లేందుకు సెలవు మంజూరు చేయాలని ఆర్డర్స్ పాస్ అయ్యాయి. అయితే, ఇప్పటికే ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన పీరియాడికల్ మూవీకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ప్రకటించారు. దేశంలోని అనేక ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు ట్యాక్స్ రాయితీ లభిస్తోంది. ఇంత వరకూ ఇతర పార్టీల ముఖ్యమంత్రులెవరైతే సానుకూల ప్రకటనలు చేయలేదు. మరోవైపు, ప్రధాని మోదీ సైతం ‘ద కాశ్మీర్ ఫైల్స్’ రూపకర్తల్ని అభినందించారు. మొదట్లో సినిమాపై పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్‌ లేనప్పటికీ ప్రస్తుతం పాజిటివ్ మౌత్ టాక్‌తో ‘ద కాశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయల వసూళ్లు సాధిస్తోంది. ఉత్తరాదిలో థియేటర్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం విశేషం...   

Updated Date - 2022-03-15T02:06:31+05:30 IST