Sunny Leone పై చర్యలు తప్పవంటోన్న మంత్రి...

ABN , First Publish Date - 2021-12-26T23:47:58+05:30 IST

మరో మూడు రోజుల్లో అన్ని రకాల సొషల్ మీడియా వేదికల్లోంచి ‘మధుబన్ మే రాధికా నాచే’ వీడియో సాంగ్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి హెచ్చరించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా అన్నారు...

Sunny Leone పై చర్యలు తప్పవంటోన్న మంత్రి...

మరో మూడు రోజుల్లో అన్ని రకాల సొషల్ మీడియా వేదికల్లోంచి ‘మధుబన్ మే రాధికా నాచే’ వీడియో సాంగ్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి హెచ్చరించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా అన్నారు. సాకిబ్ తోషి సంగీత దర్శకత్వంలో సన్ని లియోన్ తెరపై అలరించిన ‘మధుబన్ మే’ పాట తాజాగా వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దానిపైనే స్సందించిన మధ్యప్రదేశ్ మంత్రి సన్నీ లియోన్, సాకిబ్‌లపై చర్యలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


సన్నీ లియోన్ తాజా వీడియో సాంగ్ ‘మధుబన్ మే’ యూట్యూబ్‌లో విడుదలైన నాటి నుంచీ పలువురి ఆగ్రహానికి కారణం అవుతోంది. అందులో ‘రాధా దేవి’ని, శ్రీకృష్ణుని ‘బృందావనా’న్ని ప్రస్తావించారు. పాట చిత్రీకరించిన తీరు కూడా మరీ శృంగారాత్మకంగా ఉండటంతో మథురలోని పూజారులు, రాధా దేవి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీడియోని బ్యాన్ చేయాలంటూ ఇప్పటికే కంప్లైంట్స్ ఇచ్చారు. తాజాగా ఎంపీ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా సైతం సన్నీ లియోన్ పాట ‘హిందువుల మనోభావాలు’ దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడ్డారు.   

Updated Date - 2021-12-26T23:47:58+05:30 IST