The Kashmir Files : ఐఏఎస్ అధికారి ‘లక్ష్మణ రేఖ’ అతిక్రమించాడంటూ హోమ్ మంత్రి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-23T23:16:48+05:30 IST

ఆ ఐఏఎస్ అధికారిపై హోమ్ మంత్రికి ఆగ్రహం వచ్చింది. కారణం... ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా! ఇంతకీ, విషయం ఏంటంటే...

The Kashmir Files : ఐఏఎస్ అధికారి ‘లక్ష్మణ రేఖ’ అతిక్రమించాడంటూ హోమ్ మంత్రి ఆగ్రహం

ఆ ఐఏఎస్ అధికారిపై హోమ్ మంత్రికి ఆగ్రహం వచ్చింది. కారణం... ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా! ఇంతకీ, విషయం ఏంటంటే... మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నియాజ్ ఖాన్ ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వరుస ట్వీట్స్ చేశాడు. అది రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌కి నచ్చలేదు. దాంతో నియాజ్ ఖాన్‌కు షోకాజ్ నోటీస్ పంపుతామని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి తాజాగా ప్రకటించారు.  


‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కాశ్మీరీ పండిట్లపై 1990లో జరిగిన ఆకృత్యాల్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కంటికి కట్టినట్టుగా తీశారు. దేశవ్యాప్తంగా సినిమా అనూహ్య విజయం సాధించింది. అయితే, వందల కోట్లు వసూలు చేస్తోన్న వివేక్ అగ్నిహోత్రి చిత్రానికి విమర్శలు కూడా గట్టిగానే ఎదురవుతున్నాయి. ఆ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ ‘ద కాశ్మీర్ ఫైల్స్’ను ట్విట్టర్‌లో టార్గెట్ చేశాడు. ఆ సినిమా నిర్మాతను అనేక ఇతర రాష్ట్రాల్లో ముస్లిమ్‌లపై జరిగిన దాడుల గురించి కూడా సినిమాలు తీయమంటూ సవాలు విసిరాడు. ఇదంతా సీరియస్‌గా తీసుకున్న ఎంపీ గవర్నమెంట్ త్వరలో నియాజ్ ఖాన్‌కు నోటీసు జారీ చేస్తామని చెబుతోంది. మరి ఐఏఎస్ అధికారి ఎటువంటి వివరణ ఇస్తారో... వేచి చూడాలి... 

Updated Date - 2022-03-23T23:16:48+05:30 IST