Rocketry లో గెస్ట్‌ రోల్ చేసిన Shah Rukh Khan, Suriya రెమ్యూనరేషన్ ఎంతో చెప్పేసిన Madhavan

ABN , First Publish Date - 2022-06-21T19:37:13+05:30 IST

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలో అయిన నటించగలిగే టాలెంటెడ్ ఉన్న నటుల్లో ఆర్.మాధవన్ ఒకరు...

Rocketry లో గెస్ట్‌ రోల్ చేసిన Shah Rukh Khan, Suriya రెమ్యూనరేషన్ ఎంతో చెప్పేసిన Madhavan

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలో అయిన నటించగలిగే టాలెంటెడ్ ఉన్న నటుల్లో ఆర్.మాధవన్ ఒకరు. అందుకే.. ఆయనకి, ఆయన సినిమాలకి కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ వస్తుంటుంది. అలాగే.. కథల ఎంపిక సైతం ఎంతో ప్రత్యేకంగా ఉంటూ అలరిస్తుందనే నమ్మకం ప్రేక్షకులకి ఉంటుంది. మాధవన్ తాజాగా నటించిన చిత్రం ‘రాకెస్ట్రీ: నంబీ ఎఫెక్ట్’. ప్రముఖ శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, తమిళ స్టార్ సూర్య గెస్ట్ రోల్స్‌లో నటించారు. ఈ చిత్రం జూలై 1న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


మాధవన్ షారుఖ్ గురించి మాట్లాడుతూ.. ‘నేను షారుఖ్‌తో కలిసి జీరో సినిమా చేస్తున్నప్పుడే ఈ మూవీ గురించి చెప్పాను. తర్వాత ఆయన పుట్టినరోజు వేడుకలకి వెళ్లినప్పుడూ సినిమా గురించి అడిగారు. అంతేకాకుండా.. సినిమాలో నటించాలనే కోరికను వెళ్లిబుచ్చారు. అయితే.. ఆయన జోక్ చేస్తున్నాడని అనుకున్నాను. కొన్ని రోజులకి నా భార్య సరిత, షారుఖ్ ధన్యవాదాలు చెప్పమని కోరింది. దీంతో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తూ మెస్సేజ్ చేశాను. వెంటనే ఆయన మేనేజర్ షారుఖ్ ఖాన్ డేట్స్ గురించి అడుగుతున్నారని మెసేజ్ చేసింది. అలా ఆయన మా సినిమాలో పార్ట్ అయ్యాడు. అయితే.. ఆ రోల్ చేయడానికి ఆయన ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా నటించాడు.


అలాగే.. సూర్య కూడా తన పాత్ర కోసం రెమ్యూనరేషన్ తీసుకోలేదు. నిజానికి ఆయన తన సొంత ఖర్చులతో తన సిబ్బందిని ముంబైలో జరిగిన షూటింగ్‌కి తీసుకెళ్లాడు. క్యారవాన్, కాస్ట్యూమ్స్, అసిస్టెంట్స్ సంబంధించిన ఖర్చులు కూడా ఆయనే పెట్టుకున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ భారతదేశం, ఫ్రాన్స్, కెనడా, జార్జియా, సెర్బియాలో చిత్రీకరించాం. హిందీతో ఇంగ్లిష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated Date - 2022-06-21T19:37:13+05:30 IST