ఆయనకు క్షమాపణ చెబుతూనే Rocketry మూవీపై Anupam Kher రివ్యూ.. Madhavan రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-21T15:54:33+05:30 IST

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న నటుడు మాధవన్ (Madhavan). వరుసగా మంచి కంటెంట్..

ఆయనకు క్షమాపణ చెబుతూనే Rocketry మూవీపై Anupam Kher రివ్యూ.. Madhavan రియాక్షన్ ఏంటంటే..

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న నటుడు మాధవన్ (Madhavan). వరుసగా మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నాడు. ఈ నటుడు తాజాగా ‘రాకెట్రీ:ది నంబీ ఎఫెక్ట్ (Rocketry The Nambi Effect)’ అనే సినిమాకి మొట్టమొదటి సారి దర్శకత్వం వహించాడు. ఆయనే ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ.. ఇటీవలే విడుదలై సక్సెస్‌ని సాధించింది. అంతేకాకుండా.. జులై 26న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ తరుణంలో ప్రముఖ బాలీవుడ్ నటడు, ది కాశ్మీరీ ఫైల్స్ ఫేమ్ అనుపమ్ ఖేర్ ఈ మూవీపై సోషల్ మీడియాలో స్పందించాడు.


అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసిన పోస్టులో.. ‘నంబినారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన రాకెట్రీ చూశాను. అత్యద్భుతం. స్ఫూర్తిదాయకం. నా హృదయానికి హత్తుకుంది. ప్రతి భారతీయుడు ఈ మూవీని చూడాలి. మమ్మల్ని క్షమించండి నంబినారాయణన్ సార్. మనం గతంలో చేసిన కొన్ని తప్పులను అలా సరిదిద్దుకోవచ్చు. డియర్ మాధవన్ నువ్వు చాలా ధైర్యవంతుడివి. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.


అనుపమ్ పోస్ట్‌పై మాధవన్ స్పందిస్తూ.. ‘ఏం చెప్పాలో తెలియడం లేదు... మీది చాలా గొప్ప హృదయం సార్. హృదయ పూర్వకంగా చెబుతున్నా. మీ ప్రశంసలని ఆశీర్వాదంగా భావిస్తున్నా. మళ్లీ పుట్టినట్లు ఉంది. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా.. భారతదేశంతోపాటు ఫ్రాన్స్, కెనడా, జార్జియా, సెర్బియాలో చిత్రీకరించిన ఈ మూవీ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.





Updated Date - 2022-07-21T15:54:33+05:30 IST