Mega 154 : విలన్‌గా.. తమిళ విలక్షణ నటుడు ?

ABN , First Publish Date - 2022-06-27T13:56:09+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుసగా నటిస్తున్న చిత్రాల్లో బాబీ (Bobby) దర్వకత్వంలోని సినిమా ఒకటి. మెగా 154గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే మాస్ టైటిల్ ను ఖాయం చేసినట్టు మొన్నా మధ్య శేఖర్ మాస్టర్ (Sekhar Master), చిరంజీవి, తమన్ (Thaman) సైతం అనధికారికంగా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

Mega 154 :  విలన్‌గా.. తమిళ విలక్షణ నటుడు ?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుసగా నటిస్తున్న చిత్రాల్లో బాబీ (Bobby) దర్వకత్వంలోని సినిమా ఒకటి. మెగా 154గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే మాస్ టైటిల్ ను ఖాయం చేసినట్టు మొన్నా మధ్య శేఖర్ మాస్టర్ (Sekhar Master), చిరంజీవి సైతం అనధికారికంగా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. వాల్తేరు సముద్రతీరం నేపథ్యంలో మాస్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఇందులో శ్రుతిహాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తుండగా.. రవితేజ (Raviteja) ప్రత్యేక పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.


అదేంటంటే.. ఇందులో చిరుకు విలన్ గా తమిళ విలక్షణ నటుడు మాధవన్ (Madhavan) నటిస్తున్నట్టు సమాచారం. కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోగా నటించిన మాధవన్.. వాటి డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఇంతకు ముందు మాధవన్.. నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ‘సవ్యసాచి’ (Savyasachi) చిత్రంలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ.. అతడికి విలనిజానికి మంచి పేరొచ్చింది. ఇప్పుడు మరోసారి మాధవన్ విలన్‌గా నటించడం, అందులోనూ మెగాస్టార్‌కు విలన్ గా నటిస్తుండడం విశేషంగా మారింది.


ఇంటర్వెల్‌లో వచ్చే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లో మాధవన్ పాత్ర రివీల్ అవుతుందట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. త్వరలోనే మాధవన్ పాత్రపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని టాక్. ‘ముఠామేస్త్రి’ (Muthamestri) తరహాలోని చిరంజీవి వింటేజ్  పాత్ర అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుందని అంటున్నారు. బాబీ గత చిత్రం ‘వెంకీమామ’ (Venkaymama) చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో చిత్రంపై మరింత హైపు క్రియేట్ అయింది. మరి ఇందులో మాధవన్ నిజంగానే విలన్ గా నటిస్తున్నాడో లేదో తెలియాలంటే.. మరికొద్దిరోజులు ఆగాల్సిందే.  

Updated Date - 2022-06-27T13:56:09+05:30 IST