Macherla Niyojakavargam: ట్రెండింగ్‌లో ‘పోరి సూపరో’ వీడియో సాంగ్

ABN , First Publish Date - 2022-08-07T15:23:26+05:30 IST

యూత్ స్టార్ నితిన్ (Nithin) నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజక వర్గం' (Macherla Niyojakavargam). తాజాగా ఈ మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజై యూట్యూబ్‌లో

Macherla Niyojakavargam: ట్రెండింగ్‌లో ‘పోరి సూపరో’ వీడియో సాంగ్

యూత్ స్టార్ నితిన్ (Nithin) నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజక వర్గం' (Macherla Niyojakavargam). తాజాగా ఈ మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజై యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ద్వారా ఎడిటర్ ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (MS Rajashekhar Reddy) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ (Catherin Thresa).. నితిన్ సరసన హీరోయిన్‌లుగా నటించారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత ఏడాది చెక్, రంగ్ దే సినిమాలతో వచ్చిన నితిన్ ఆశించిన విజయాలను అందుకోలేపోయాడు.


దాంతో సాలీడ్ హిట్ కొట్టాలనే కసితో చాలా కథలు విన్నప్పటికీ ఫైనల్‌గా 'మాచర్ల నియోజక వర్గం' కథ నచ్చి ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని భారీ అంచనాల మధ్యన ఆగస్టు 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు, సాంగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వీడియో సాంగ్‌ను మేకర్స్ వదిలారు.


‘‘పోరీ సూపరో యయితు వండరో.. 

ఫెడు లైట్ ఐసురో..లిప్పుతో హార్టే ఆపేయ్‌రో..

క్యూటీ థండరో..

షేపే టాపురో’’..


అంటూ సాగే ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సాంగ్‌కి సాహిత్యం కృష్ణకాంత్ అందించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. మహతి స్వరసాగర్  రాహుల్ సిప్లిగంజ్ గీతా మాధురి పాడారు. మొత్తానికి అన్నీ రకాల ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో బాగానే అంచనాలను పెంచారు. మరి నితిన్ ఈ మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. 



Updated Date - 2022-08-07T15:23:26+05:30 IST