Macherla Niyojakavargam: రాజమౌళి హీరోలా ఎలివేషన్‌ ఇవ్వాలా

ABN , First Publish Date - 2022-07-31T02:51:32+05:30 IST

‘‘నువ్వేమో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లా పంచ్‌లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్‌.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. రాజమౌళి హీరోలా ఎలివేషన్‌ ఇవ్వాలా’’ అనే డైలాగ్‌లో పవర్‌ఫుల్‌లో దర్శనమిచ్చారు హీరో నితిన్‌. తాజాగా ఆయన నటించిన ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రంలోని డైలాగ్‌ ఇది.

Macherla Niyojakavargam: రాజమౌళి హీరోలా ఎలివేషన్‌ ఇవ్వాలా

‘‘నువ్వేమో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లా పంచ్‌లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్‌.. ఇప్పుడు నేనేం చెయ్యాలి..  రాజమౌళి హీరోలా ఎలివేషన్‌ ఇవ్వాలా’’ అనే డైలాగ్‌తో పవర్‌ఫుల్‌గా దర్శనమిచ్చారు హీరో నితిన్‌(Nithin). తాజాగా ఆయన నటించిన ‘మాచర్ల నియోజక వర్గం’ (Macherla Niyojakavargam)చిత్రంలోని డైలాగ్‌ ఇది. గుంటూరులోన బ్రోడీపేటలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల యాభై సెకెన్ల నిడివి గల ట్రైలర్‌లో పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లా అనిపించింది. 

‘కలెక్టర్‌ మీద చెయ్యేస్తే గవర్నమెంట్‌ మీద చెయ్యి వేసినట్టే’ అన్న డైలాగ్‌ వపర్‌ఫుల్‌గా ఉంది. రాజప్పగా సముద్రఖని విలన్‌ ఎంట్రీ టెర్రిఫిక్‌గా వుంది. నియోజక వర్గంలో ఎన్నికలు నిర్వహించి తీరుతానని, కలెక్టర్‌గా అది నా బాధ్యత అని నితిన్‌ రాజప్ప పాత్రధారి సముద్రఖనికు సవాల్‌ విసిరే సన్నివేశం ఆకట్టుకుంటుంది.  (Macherla Niyojakavargam trailer)

 

కృతీశెట్టి, కేథరిన్‌ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్మెస్‌ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి ప్రత్యేక గీతంలో కనిపిస్తారు శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.  రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పకుడు. ఆగస్ట్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. (Macherla Niyojakavargam on 12 august)





Updated Date - 2022-07-31T02:51:32+05:30 IST