Macherla Niyojakavargam లేటెస్ట్ అప్‌డేట్..

ABN , First Publish Date - 2022-07-09T16:14:50+05:30 IST

నితిన్ (Nithin) హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam). ఈ సినిమా ఈవెంట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ను ఇచ్చిది చిత్రబృందం. ప్రముఖ ఎడిటర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి

Macherla Niyojakavargam లేటెస్ట్ అప్‌డేట్..

నితిన్ (Nithin) హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam). ఈ సినిమా ఈవెంట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ను ఇచ్చిది చిత్రబృందం. ప్రముఖ ఎడిటర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajashekhar Reddy) తొలిసారిగా ఈ మూవీ ద్వారా మెగా ఫోన్ పడుతున్నారు. ఇందులో నితిన్ సరసన క్యాథరీన్ థ్రెసా (Catherine Tresa), కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గత ఏడాది నితిన్ నుంచి వచ్చిన 'రంగ్ దే', 'చెక్' సినిమాలి ఆశించిన విజయాలను ఇవ్వలేకపోయాయి. దాంతో ఇప్పుడు నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీతో హిట్ కోట్టాలనే కసితో ఉన్నాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


ఆదిత్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ సంస్థలపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తుండగా, దీనికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ అంజలి (Anjali) ఒక మాస్ సాంగ్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. మాస్ ఆడియన్స్ కోసమే అనేట్టుగా ఉన్న ఈ సాంగ్ సినిమాకి బాగా హైలెట్ అవుతుందనీ మేకర్స్ చెబుతున్నారు. 


'రా రెడ్డి ఐయాం రెడీ' అనే పల్లవితో సాగె ఈ సాంగ్ ప్రోమో ఇప్పటికే యూట్యూబ్ లో సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే, శ్రీకాకుళంలో ఈనెల 9న 'మాస్ జాతర' పేరుతో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ మాస్ సాంగ్ ని కూడా అదే ఈవెంట్‌లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఫిక్సైయ్యారు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రేక్షకాభిమానులకు రవాణా ఇబ్బందులు కలుగకుండా ఈ ఈవెంట్ వెన్యూ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మాచర్ల నియోజకవర్గం మూవీని ఆగస్టు 12న విడుదల భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.



Updated Date - 2022-07-09T16:14:50+05:30 IST