Macherla Niyojakavargam: ఇంకెన్ని రోజులీ పబ్లిసిటీ స్టంట్స్?

ABN , First Publish Date - 2022-07-29T01:42:38+05:30 IST

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajashekhar Reddy) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిక్కుల్లో ఇరుక్కుంది. దీనికి కారణం దర్శకుడే

Macherla Niyojakavargam: ఇంకెన్ని రోజులీ పబ్లిసిటీ స్టంట్స్?

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajashekhar Reddy) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిక్కుల్లో ఇరుక్కుంది. దీనికి కారణం దర్శకుడే అయ్యాడు. క్యాస్ట్ కాంట్రవర్సీలో నితిన్ సినిమా ఇరుక్కోవడానికి కారణం దర్శకుడు రాజశేఖరే. తన పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌తో ఎవరో కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు అనేది రాజశేఖర్ వాదన. అయితే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. సినిమాకి పబ్లిసిటీ కావాలి కాబట్టే.. ఇలా అనవసర గొడవలని తెరపైకి తెచ్చుకుంటున్నారనేది కొందరి అభిప్రాయం. 


సరిగ్గా ఇలానే విశ్వక్ సేన్ ‘గేట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో’, ‘సూసైడ్ ప్రాంక్’ కూడా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమా ప్రొమోషన్స్ కోసం స్క్రిప్టెడ్ స్టంట్ చేశాడు. ఆ మధ్య ఒక చిన్న సినిమా కూడా పబ్లిసిటీ కోసం పోలీస్ యూనిఫాంలో హీరోయిన్, రౌడీ అయిన హీరోని ముద్దు పెట్టుకుంటున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోనీ ఆ సినిమా చీప్ పబ్లిసిటీతోనైనా.. థియేటర్స్‌లో సూపర్‌గా ఆడిందా అంటే అది కూడా లేదు. అసలు పబ్లిసిటీలో కాదు సినిమాలో విషయం లేకపోతే, ఏ సినిమా ఆడదు. కథలో, కథనంలో విషయం ఉంటే మౌత్ టాక్‌తోనే సినిమా హిట్ అవుతుంది. పబ్లిసిటీ వీక్‌గా ఉన్నా.. సినిమాకి వచ్చే టాక్, ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పిస్తుంది. అంతే కానీ, సినిమాలో విషయం లేకుండా... సూసైడ్ ప్రాంక్స్ చేసినా, లిప్ కిస్ పోస్టర్స్ వదిలినా, న్యూడ్ పోస్టర్స్ రిలీజ్ చేసినా, ప్రస్తుత క్యాస్ట్ కాంట్రవర్సీలా నానా యాగి చేసినా... పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రేక్షకులకి ఇదంతా నాన్ సెన్స్‌లా అనిపిస్తుంది తప్ప, ఇట్ డజ్‌నాట్ మేక్ ఎనీ సెన్స్.

Updated Date - 2022-07-29T01:42:38+05:30 IST