Thank You: తాడో పేడో.. తేల్చేయ్ మంటోన్న చైతూ!

ABN , First Publish Date - 2022-06-11T01:12:50+05:30 IST

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’ (Thank You). సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు (Dil Raju), శిరీష్‌ (Shrish).. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్..

Thank You: తాడో పేడో.. తేల్చేయ్ మంటోన్న చైతూ!

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya),  ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’ (Thank You). సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు (Dil Raju), శిరీష్‌ (Shrish).. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) పతాకంపై  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా (Raashi Khanna), మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన  ఈ చిత్రం నుంచి తాజాగా ‘మారో మారో’ (Maaro Maaro)  అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. 


‘‘సై అంటే సైరా.. సంసిద్ధం లేరా..

సంకల్పం సంధిస్తా లే.. పంతం సాధించేలా..

పోరాటం క్రీడ.. నీ మతమైతే రా..

క్రీడైనా పోరాటంలా.. మార్చి వురికిస్తారా..

ఈ అసురుల గణముకే.. ఆ అధిపతి ఎవడనే

ఈ తలపడు క్షణమునే.. దుర్యధనో.. దుశ్శాసనో.. తేల్చే రగడలో..

మారో మారో.. యుద్ధం మొదలు

తాడో పేడో.. తేల్చేయ్ ఇపుడు...’’ అంటూ సాగిన ఈ పాటకు సంగీతం సంచలనం ఎస్. థమన్ (S Thaman) స్వరాలను సమకూర్చగా.. విశ్వ (Viswa) అండ్ కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)  చక్కటి సాహిత్యాన్ని అందించారు. దీపు (Deepu) మరియు ప్రదీప్ చంద్ర (Prudhvi Chandra) ఈ పాటను ఆలపించారు. కాగా, బీవీఎస్ రవి (BVS Ravi) కథను సమకూర్చిన ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 



Updated Date - 2022-06-11T01:12:50+05:30 IST